జాతీయ వార్తలు

అయోధ్యలో ఏం జరుగుతోంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిఘా వర్గాలను కోరిన యూపీ సర్కార్

లక్నో, డిసెంబర్ 21: అయోధ్యలో జరుగుతున్న కార్యకలాపాలపై ‘రహస్య’ నివేదిక సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిఘా వర్గాలను కోరింది. రామాలయ నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా రాళ్లను సేకరించనున్నట్లు విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) ప్రకటించిన ఆరు నెలల తర్వాత రాళ్లతో కూడిన రెండు ట్రక్కులు అయోధ్యకు చేరుకోవడంతో అక్కడ ఏమి జరుగుతోందన్న దానిపై రహస్య నివేదిక సమర్పించాల్సిందిగా ఇంటెలిజెన్స్ అదనపు డిజిపికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని శాంతి, భద్రతల విభాగం ఐజి ఎ.సతీష్ గణేష్ తెలిపారు. అయోధ్యలో విశ్వ హిందూ పరిషత్‌కు చెందిన రామసేవక్ పురంలో రెండు ట్రక్కుల రాళ్లను దించి రామ జన్మభూమి ట్రస్టు అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆధ్వర్యంలో ‘శిలా పూజ’ జరిపించామని విహెచ్‌పి అధికార ప్రతినిధి శరద్ శర్మ ఆదివారం ప్రకటించిన విషయం విదితమే. అయోధ్యలో ఆలయ నిర్మాణానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం నుంచి ‘సిగ్నల్’ వచ్చిందని నృత్య గోపాల్ దాస్ తెలిపారు. అయితే అయోధ్యలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అయోధ్యకు తీసుకొచ్చిన రాళ్లను ఒక ప్రైవేటు ప్రాంగణంలో ఉంచడంతో తాము అప్రమత్తమయ్యామని, అక్కడ ఎవరైనా శాంతి భద్రతలకు గానీ మతసామరస్యతకు గానీ విఘాతం కలిగిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఫైజాబాద్ ఎస్పీ మొహిత్ గుప్తా స్పష్టం చేశారు. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని, ఇందుకో సం దేశ వ్యాప్తంగా రాళ్లను సేకరిస్తున్నామని విహెచ్‌పి గత జూన్‌లో ప్రకటించడంతో పాటు ఆలయ నిర్మాణానికి ఎటువంటి అడ్డంకులు సృష్టించవద్దని ముస్లిం మతస్థులకు విజ్ఞప్తి చేసింది.