రాష్ట్రీయం

మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లోనూ త్వరలో ఎల్‌ఇడి దీపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్న

విశాఖపట్నం, డిసెంబర్ 28: రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో ఎల్‌ఇడి విద్యుద్దీపాలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. సోమవారం ఆయన విశాఖ కలెక్టరేట్‌లో విద్యుద్దీపాల నిర్వహణపై సమీక్షించారు. రాష్ట్రంలో విద్యుత్ పొదుపులో ఆదర్శంగా నిలుస్తున్న జివిఎంసి (మహావిశాఖ నగరపాలక సంస్థ)లో విద్యుత్ పొదుపుకు తీసుకుంటున్న చర్యల గురించి ఈ సందర్భంగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. అనంతరం మంత్రి అయ్యన్న మాట్లాడుతూ సుమారు రూ.65 కోట్ల వ్యయంతో 94వేల వీది దీపాలను ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ ద్వారా ఏర్పాటు చేశామని చెప్పారు. ఎల్‌ఇడి దీపాల వల్ల దాదాపు 45 నుంచి 50 శాతం విద్యుత్ ఆదా చేయగలిగామన్నారు. విద్యుత్ వినియోగంలో సాంప్రదాయ పద్ధతిలో 9 నెలల కాలానికి 172.78 లక్షల యూనిట్లు వినియోగించగా, ఎల్‌ఇడి విద్యుద్దీపాలతో 104.52 లక్షల యూనిట్లకు తగ్గించగలిగామన్నారు. దీనివల్ల దాదాపు రూ.14కోట్లు ఆదా చేయగలిగామని చెప్పారు. అలాగే విద్యుద్దీపాలు వెలగని ప్రాంతాల్లో 48 గంటల్లో అక్కడ కొత్త దీపాలను ఏర్పాటు చేయాలన్న నిబంధనపై సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ అమెరికాలోని లాస్‌ఏంజిల్స్ వంటి నగరంలో ఎల్‌ఇడి విద్యుద్దీపాలు మార్చేందుకు నాలుగేళ్లు సమయం పట్టగా, విశాఖలో కేవలం ఏడాది వ్యవధిలోనే ఎల్‌ఇడి దీపాలు అమర్చడం విశేషమన్నారు.