బిజినెస్

తగ్గనున్న విదేశీబ్రాండ్ మోటార్ బైక్‌ల ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: హార్లే డేవిడ్సన్, ట్రియంఫ్ వంటి అత్యున్నత, సంపన్న శ్రేణికి చెందిన మోటార్‌బైక్‌ల ధరలు తగ్గనున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఖరీదైన మోటార్‌సైకిళ్లపై విధించిన దిగుమతి సుంకం భారీగా తగ్గడంతో ఇది సాధ్యం కానుంది. విదేశాల్లో పూర్తిగా తయారైన మోటార్ బైక్‌లపై దిగుమతి సుంకాన్ని 50 శాతం మేరకు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆయా వాహనాల కొనుగోళ్ల పెరిగే అవకాశం ఉంది. గతంలో 800 సీసీ కన్నా తక్కువ సామర్థ్యం ఇంజిన్లున్న మోటార్ సైకిళ్లను దిగుమతి చేసుకుంటే వాటిపై 60 శాతం, అంతకన్నా ఎక్కువ ఉంటే 75 శాతం దిగుమతి సుంకాన్ని విధించేవారు. కాగా పూర్తిగా తయారైన పై వాహనాలపై దిగుమతి సుంకాన్ని 50 శాతానికి తగ్గిస్తూ సోమవారం నాడు 12న సెంట్రల్ బోర్డ్ ఆప్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రస్తుతం ఆ తరహా అత్యున్నత శ్రేణి మోటార్ సైకిళ్ల తయారీ దేశంలో జరగడం లేదని, అందువల్ల వాటిపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలన్న డిమాండ్ పరిశ్రమలో చాలాకాలంగా ఉందని, ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం సహేతుకమైనదని నిపుణులు చెబుతున్నారు. విదేశాల్లో పూర్తిగా తయారై భారత్‌లో విక్రయానికి వస్తున్న ఖరీదైన మోటార్ బైక్స్‌పై దిగుమతి సుంకం భారీగా తగ్గించడం మంచి పరిణామమని ఈవై భాగస్వామి అభిషేక్ చెప్పారు. అయితే పూర్తిగా విదేశాల్లో తయారైన వాహనాలకే ఇది వర్తిస్తుంది. వాటి విడిభాగాలను తీసుకొచ్చి భారత్‌లో అమర్చి వాహనాలను రూపొందించాలనుకుంటే విధించే దిగుమతి సుంకాన్ని పది నుంచి 15 శాతానికి పెంచారు. ఆటోమొబైల్ అనుబంధ పరిశ్రమకు ఎటువంటి సమస్య ఎదురుకాకుండా, మేక్ ఇన్ ఇండియా విధానం అమల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.