బిజినెస్

రాష్ట్రంలో అతిపెద్ద కాగితం పరిశ్రమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 14: ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన కాగితం తయారీ సంస్థ ‘ఆసియా పల్ప్ అండ్ పేపర్’ (ఏపీపీ) రాష్ట్రంలో అడుగుపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన ఏపీపీ ప్రతినిధులు భారతదేశంలోనే అతి పెద్ద కాగిత తయారీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. పెద్దఎత్తున ముడిపదార్థాలను దిగుమతి చేసుకునేందుకు, చైనా మార్కెట్‌ను దృష్టిలో ఎట్టుకుని తూర్పుతీరంలో ఉన్న ఏపీలో తమ సంస్థను నెలకొల్పాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఇందుకోసం ఏదైనా నౌకాతీరానికి సమీపంలో రెండున్నర వేల ఎకరాల భూమిని కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు. ముఖ్యమంత్రి దీనికి సానుకూలంగా స్పందిస్తూ కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టు పరిసర ప్రాంతాలను పరిశీలించాల్సిందిగా సూచించారు. తమకు భూమిని కేటాయించిన రెండున్నరేళ్లలోనే ఉత్పత్తిని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రికి ఏపీపీ ప్రతినిధులు వివరించారు. రోజుకు సరాసరి 4 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ పరిశ్రమను నెలకొల్పుతామని, ఇందులో నాలుగో వంతు దేశీయ విపణికే కేటాయిస్తామని చెప్పారు.
‘బేయర్’ రాకతో రైతుకు దన్ను
జర్మనీకి చెందిన ఆగ్రో కెమికల్స్ సంస్థ బేయర్ ఆంధ్రప్రదేశ్ రైతులకు పంట రక్షణ, వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, డిజిటల్ ఫార్మింగ్ వంటి అంశాలలో సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రితో బుధవారం తమ ప్రతిపాదనలు ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు. సన్న, చిన్నకారు రైతుల సంక్షేమమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని, ఇప్పటికే సాగులో సాంకేతికతను మేళవించి ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నామని ముఖ్యమంత్రి వారికి చెప్పారు. భూసార పరీక్షల్లో అధునాతన పరికరాలు, సీసీ కేమేరాలు, డ్రోన్ల సాయాన్ని తీసుకుంటున్నామని తెలిపారు. టమోటా పంటకు ప్రసిద్ధి చెందిన మదనపల్లిలో, మామిడి పంటకు ప్రఖ్యాతిగాంచిన చిత్తూరు జిల్లాలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. సమగ్ర ప్రతిపాదనలతో నెల రోజుల్లోగా వస్తే ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు.
వివిధ సిమెంట్ కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ నిర్మాణ పనులకు ప్రస్తుతం అందిస్తున్న ధరలకే మరో ఏడాది పాటు సిమెంట్ సరఫరా చేస్తామని ప్రతినిధులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుకు ఇంకాస్త ధర తగ్గించే ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సూచించారు. ప్రభుత్వానికి అందించే సిమెంట్ పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు ఈ నెల 22న ఫ్రేమ్ వర్క్ అమర్చే పనులను ప్రారంభించాల్సిందిగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ ఎండీ కూఖ్యున్ షిమ్ బుధవారం ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.
chitram...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ అయిన ఏపీపీ ప్రతినిధులు