బిజినెస్

64 మిలియన్ టన్నుల కార్గో లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 16: సవాళ్లు ఎదురైనప్పటికీ విశాఖ పోర్టు ట్రస్టు (వీపీటీ) కార్గో హ్యాండ్లింగ్‌లో లక్ష్యాన్ని అధిగమిస్తోందని చైర్మన్ ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. విశాఖలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్గో హ్యాండ్లింగ్‌లో వీపీటీ నాలుగవ స్థానం సాధించిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి మాసాంతానికి 61 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ సాధించగా, గతేడాదితో పోలిస్తే 3 శాతం అధికమన్నారు. మార్చి మాసాంతానికి వీపీటీ 64 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ సాధిస్తుందన్నారు. విశాఖలో పోర్టులో కొన్ని పీపీపీ ప్రాజెక్టుల కారణంగా సామర్థ్యానికి మించి పనిచేయలేకపోతున్నామన్నారు. విశాఖ పోర్టు నుంచి నేపాల్‌కు కంటైనర్ రవాణాలో కొన్ని అంశాలు అడ్డంకిగా నిలుస్తున్నాయన్నారు. కస్టమ్స్ అనుమతుల నేపథ్యంలో నేపాల్‌కు కంటైనర్ కార్గో ఆలస్యం అవుతున్నట్టు పేర్కొన్నారు. ఖాట్మండ్ నుంచి సరకు రవాణాకు సంబంధించిన క్లియరెన్స్‌లు నేరుగా కస్టమ్స్‌కు అందాల్సి ఉందన్నారు. అయితే విశాఖలో నేపాల్ కాన్సులేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసే అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటైతే ఆలస్యమయ్యే అవకాశం ఉండదన్నారు. ప్రస్తుతం నేపాల్‌కు రోజు విడిచి రోజు ఒక ర్యాక్ వెళ్తోందని, కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటైతే పరిస్థితుల్లో మార్పు వస్తుందన్నారు. ప్రస్తుతం పీర్‌గంజ్ వరకూ కంటైనర్లను చేరవేస్తున్నామని, అక్కడ కస్టమ్స్ తనిఖీల అనంతరం నేపాల్ ప్రతినిధులు బాధ్యత తీసుకుంటారన్నారు. విశాఖలో బీచ్ కోత నివారణకు పోర్టు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి ఏటా కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక ఒడ్డుకు చేరవేస్తూ కోత నియంత్రణ చర్యలు చేపడుతున్నట్టు కృష్ణబాబు వెల్లడించారు. ప్రస్తుత సంవత్సరం రూ.18.37 కోట్ల ఖర్చుతో సుమారు మూడు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తీరానికి తరలిస్తున్నామన్నారు. గతేడాది ఇదే సీజన్‌లో 1.57 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తరలించామన్నారు. బీచ్ కోత నివారణకు సంబంధించి నెదర్లాండ్స్‌కు చెందిన ప్రఖ్యాత సంస్థ డెల్టారిస్ అధ్యయనం చేస్తోందని, వచ్చే జనవరి నాటికి పూర్తి నివేదిక ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రపంచ బ్యాంకు నిధులతో కోత నివాణర చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. అప్పటి వరకూ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్‌ఐవోటీ) సూచన మేరకు తీరంలో ఇసుక మేటలు వేస్తున్నామన్నారు. తీరంలో నిర్మణాలు, పోర్టులు, కర్మాగారాల కారణంగా తీరం కోతకు గురవుతోందని, దీన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 974 కిలోమీటర్ల సువిశాల తీరం కలిగిన ఏపీలో సుమాలరు 271 కిమీలో తీరం తరచు కోతకు గురవుతోందన్నారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులే దీనికి కారణంగా పేర్కొన్నారు.