బిజినెస్

విదేశాల్లో గనుల కొనుగోలుకు ప్రభుత్వ సంస్థల జాయింట్ వెంచర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16:విదేశాల్లో వ్యూహాత్మక ఖనిజాల సేకరణ లక్ష్యంగా గనుల కొనుగోలుకు ప్రభుత్వరంగ సంస్థలైన నాల్కో, హెచ్‌సీఎల్, ఎమ్‌ఈసీఎల్‌లతో కలసి జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. దేశంలో లభించని, ఒకవేళ ఉన్నా స్వల్పస్థాయిలోనే లభిస్తున్న ఖనిజాల కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందిస్తోంది. తద్వారా ఆయా ఖనిజాల కోసం ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నది ప్రధాన లక్ష్యం. కాగా పై మూడు సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేస్తూ అవగాహన కుదుర్చుకున్నాయి. అందు లో భాగంగానే విదేశాల్లో గనులను కొనుగోలు చేసి కీలక ఖనిజాలను వెలికితీసేందుకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు గనులశాఖ కార్యదర్శి అరుణ్‌కుమార్ విలేకరులకు తెలిపారు. న్యూఢిల్లీలో జియలాజికల్ బోర్డు సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈమేరకు ప్రకటన చేశారు. ఈ జాయింట్ వెంచర్ సంస్థ ప్రాథమికంగా కీలక ఖనిజాల తవ్వకాలపై దృష్టిపెడుతుందని, భవిష్యత్‌లో మరిన్ని ఖనిజాలపై దృష్టిసారిస్తుందని ఆయన చెప్పారు. నిజానికి ఈ కీలక ఖనిజాల వ్యవహారంలో తక్షణ వాణిజ్యానికి అవకాశాలు చాలా తక్కువని, అయితే విదేశాల్లో గనుల కొనుగోలు ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.