బిజినెస్

పీఎన్‌బీకి మరో దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 20: భారీ కుంభకోణంలో చిక్కుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు మరో గట్టి దెబ్బ తగిలింది. ప్రఖ్యాత ఆర్థిక విశే్లషణ, పరిశోధక సంస్థలు మూడీస్, ఫిచ్ పీఎన్‌బీకి ఇచ్చిన రేటింగ్, గ్రేడింగ్‌లను తగ్గించే దిశగా అడుగులు వేశాయి. కుంభకోణం దరిమిలా స్టాక్‌మార్కెట్‌లో షేర్ల విలువ పడిపోయి భారీ నష్టాలను ఎదుర్కొంటున్న పీఎన్‌బీకి తాజా పరిణామాలు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టనున్నాయి. ప్రస్తుతం పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు బీఏఏ3-పీ-3 రేటింగ్ ఇచ్చిన మూడీస్ తాజా కుంభకోణంలో ఆ స్థాయిని సమీక్షించాలని నిర్ణయించింది. ఆ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసి ‘బీఏఏ3’గా ప్రకటించేందుకు అవసరమైన సమీక్ష చేస్తున్నట్లు ప్రకటించింది. పీఎన్‌బీలో జరిగిన కుంభకోణం ఆర్థికంగా ఎంతమేరకు ప్రభావం చూపనుంది, బ్యాంకు మూలధన వ్యవహారాలను చక్కదిద్దేందుకు యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకుంది, బ్యాంకులో ఆర్థిక వ్యవహారాలను నియంత్రించేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారనే అంశాలను సమీక్షించనున్నట్లు మూడీస్ సంస్థ ప్రకటించింది. బ్యాంక్ బేస్‌లైన్ క్రెడిట్ అసెస్‌మెంట్ (బీసీఏ), సవరించిన బీసీఏ ఆఫ్ బీఏ3, కౌంటర్ పార్టీ రిస్క్ అసెస్‌మెంట్ (సీఆర్‌ఏ) రేటింగ్ ఆఫ్ బీఏఏ3 (సీఆర్)-పీ3(సీఆర్)లను డౌన్‌గ్రేడ్ చేసే అంశాన్ని ఇప్పుడు మూడీస్ పరిశీలిస్తోంది. దాదాపు రూ.11,400 కోట్ల మేర జరిగిన అక్రమ లావాదేవీల వల్ల పీఎన్‌బీ కుదేలవుతోంది. మళ్లీ కోలుకోవడానికి ప్రభుత్వం నుండి పెద్దఎత్తున మూలధనం సమకూర్చుకోవలసి ఉంటుంది. మరోవైపు షేర్‌మార్కెట్‌లో తీవ్రనష్టాలు ఎదురవుతున్నాయి. పీఎన్‌బీ లాభాలపై తాజా పరిణామాలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ నేపథ్యంలో మార్చి 2019లోగా బ్యాంకు 8 శాతం మేరకు కామన్ ఈక్విటీ టైర్ 1 (సీఈటీ1) నిష్పత్తిని సాధించాల్సి ఉంటుంది.
‘్ఫచ్’ ఏమంటోంది...
ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో అతిపెద్దదిగా చెప్పబడుతున్న రూ.11,400 కోట్ల కుంభకోణం దరిమిలా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను ‘రేటింగ్ వాచ్ నెగిటివ్’ (ఆర్‌డబ్ల్యూఎన్)లో చేర్చినట్లు ‘్ఫచ్’ వెల్లడించింది. బ్యాంకులో పెద్దస్థాయిలో ఏళ్ల తరబడి జరుగుతున్న అక్రమాలను కనిపెట్టలేకపోవడం, ఇంటాబయటా సమస్యల నివారణకు తగిన చర్యలు తీసుకోకపోవడం, పర్యవేక్షణపై శ్రద్ధ లేకపోవడం వంటి కారణాలవల్లే ఈ పరిస్థితి తలెత్తిందా అని ఫిచ్ ప్రశ్నించింది. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం పీఎన్‌బీకి ‘రేటింగ్ వాచ్ నెగిటివ్’లో ‘్ఫచ్’ ‘బీబీ’ రేటింగ్ ఇచ్చింది. తాజా కుంభకోణంవల్ల పీఎన్‌బీ ప్రతిష్ఠ మసకబారుతుందని, పెట్టుబడులపై ప్రభావం పడుతుందన్న ఫిచ్ పరిస్థితులు చక్కబడి స్పష్టత వచ్చాక మళ్లీ ‘ఆర్‌డబ్ల్యూఎన్’ను మళ్లీ సమీక్షిస్తామని ప్రకటించింది. ఇంతకాలం ‘బీబీబీ’ రేటింగ్‌తో (సపోర్ట్ రేటింగ్ ఫ్లోర్) రాణించిన పీఎన్‌బీ కోలుకుని పూర్వవైభవం సాధించగల సంస్థగా ఫిచ్ అభివర్ణించింది.