బిజినెస్

ఏపీఈపీడీసీఎల్‌కు జాతీయ స్థాయి అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 9: గ్రామీణ విద్యుదీకరణ ప్రాజెక్టులను సమర్థవంతంగా అమలుపరిచినందుకు ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(ఏపీఈపీడీసీఎల్)కి జాతీయ స్థాయి అవార్డు దక్కింది. భారతదేశంలో మరేక్కడా సాధించలేని విధంగా ఒక్క ఏపీలో ఉన్న ఈపీడీసీఎల్ మాత్రమే దీనిని సాధించగలిగింది. ప్రతిష్ఠాత్మకమైన ఐఎస్‌జీఎఫ్ ఇన్నోవేషన్ అవార్డ్స్-2018 డైమండ్ అవార్డు(తొలి బహుమతి)ని సొంతం చేసుకుంది. నూరు విద్యుదీకరణ పనులను సాధించేందుకు ‘యుటీలిటీ ద్వారా ఉత్తమ గ్రామీణ విద్యుదీకరణ ప్రాజెక్టులు విభాగంలో ఈ సంస్థ అవార్డను పొందగలిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామీణ విద్యుదీకరణ పథకాలను ఏపీఈపీడీసీఎల్ సంస్థ పక్కాగా అమలు చేసింది. గ్రామీణ విద్యుదీకరణ పథకాలు, గృహాలకు నూరు శాతం విద్యుదీకరణను సాధించింది. ఇండియన్ స్మార్ట్ గ్రిడ్ వీక్ -2018’ ఫోరమ్(ఐఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో ఈ నెల అయిదో తేదీ నుండి తొమ్మిదో వరకు ‘ఇండియన్ స్మార్ట్ గ్రిడ్ వీక్-2018’ పేరిట ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఏపీఈపీడీసీఎల్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్‌వై దొర తరపున చీఫ్ జనరల్ మేనేజర్(ప్రాజెక్ట్స్) వి.విజయలలిత, కేంద్ర విద్యుత్‌శాఖ అడిషనల్ సెక్రటరీ బీఎన్ శర్మ చేతులమీదుగా ఈ అవార్డును అందుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. సంస్థ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల వినియోగదారులకు అంకితభావంతో సేవలందిస్తున్న ఏపీఈపీడీసీఎల్ సిబ్బంది కార్యదక్షతకు ఈ అవార్డు చిహ్నమని సంస్థ సీఎండి దొర ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన సంస్థ అధికారులను అభినందిస్తూ ఇటువంటి అవార్డులు అధికారుల బాధ్యతలు పెంచుతాయని పేర్కొన్నారు.
chitram....
అవార్డును అందుకుంటున్న ఈపీడీసీఎల్
జనరల్ మేనేజర్ (ప్రాజెక్స్) విజయలలిత