బిజినెస్

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 8: దేశీయ నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ బలహీన పడడంతో బంగారం ధర సోమవారం స్వల్పంగా తగ్గింది. పండు రోజులు కావడంతో, ఇటీవల విపరీతమైన డిమాండ్‌తో పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈవారం మొదటి రోజైన సోమవారం కొంత తగ్గినప్పటికీ, రాబోయే రోజుల్లో మరింతగా పుంజుకుంటుందని విశే్లషకుల అభిప్రాయం. దసరా ముందు, నవరాత్రి ఉత్సవాలకు దేశం మొత్తం ముస్తాబవుతుండగా, అదే సమయంలో ఆభరణాలకు డిమాండ్ పెరుగుతుందనేది వాస్తవం. కాగా, 10 గ్రాముల బంగారం 30 రూపాయలు తగ్గి, 31,870 రూపాయల వద్ద ముగిసింది. ఈనెల ఆరంభంలో అత్యధికంగా 32,100 రూపాయలుగా నమోదైన పది గ్రాముల బంగారం సోమవారం కొంత తగ్గినప్పటికీ, ఒకటిరెండు రోజుల్లో మళ్లీ పుంజుకుంటుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇలావుంటే, బంగారంతోపాటు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. 500 రూపాయలు తగ్గడంతో కిలో వెండి ధర 39,300 రూపాయలకు చేరింది. ఆరోతేదీన అత్యధికంగా 39,800 రూపాయలుగా ఉన్న వెండి ధర సోమవారం కొద్దిగా తగ్గింది. అయితే, బంగారం మాదిరిగానే వెండి ధర కూడా మళ్లీ పెరగడం ఖాయమని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.