భయపెట్టే వౌనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మురళీకృష్ణ, భానుశ్రీ, ఐశ్వర్య ముఖ్యపాత్రల్లో కిషన్‌సాగర్ దర్శకత్వంలో లాస్‌ఏంజిల్స్ టాకీస్ పతాకంపై సంధ్యామోషన్ పిక్చర్స్ సమర్పణలో అల్లూరి సూర్యప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘వౌనం’. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు కిషన్‌సాగర్ మాట్లాడుతూ, ప్రేమకథతో కూడిన హారర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఘోస్ట్‌కి, స్పిరిట్‌కివున్న భేదాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సైంటిఫిక్ రీజన్‌తో తెరకెక్కుతున్న మొదటి చిత్రం ఇదని, షూటింగ్ మొత్తం పూర్తిచేసుకుందన్నారు.
కనకాల సుబ్బారావు మాట్లాడుతూ, గతంలో సంపత్‌నందితో ‘గాలిపటం’ చిత్రానికి చేశామని, ప్రతి సంవత్సరం తమ బ్యానర్ నుండి సినిమా రూపొందేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. మంచి కథతో తెరకెక్కుతున్న చిత్రం ఇదన్నారు. ఎం.ఎం.శ్రీలేఖ మాట్లాడుతూ, ఇందులో ఒకే పాట వుంటుందని, ఇలాంటి హారర్ చిత్రానికి సంగీతం అందించడం మొదటిసారని, రీరికార్డింగ్‌కి అధిక ప్రాధాన్యత వుంటుందన్నారు.
హీరో మురళీకృష్ణ మాట్లాడుతూ,‘మల్లెపూవు’ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్నానని, మళ్లీ ఇంత మంచి సినిమాలో నటిస్తుండడం ఆనందంగా వుందన్నారు. ఈ చిత్రానికి కెమెరా:కిషన్ సాగర్, సంగీతం:ఎం.ఎం.శ్రీలేఖ, కథ:అనిల్ కె.నాని, మాటలు:శివశర్వాణి, నిర్మాత:అల్లూరి సూర్యప్రసాద్, దర్శకత్వం:కిషన్ సాగర్.