రాష్ట్రీయం

బాంబు పేలి జవాన్‌కు గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జనవరి 23: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో శనివారం ప్రెషర్ బాంబ్ పేలి ఒక జవానుకు తీవ్రగాయాలయ్యాయి. దంతెవాడ జిల్లాలోని సామేలీ గ్రామం వద్ద రోడ్డు నిర్మాణం జరుగుతోంది. సీఆర్‌పీఎఫ్ 111 బెటాలియన్‌కు చెందిన జవాన్లు నిర్మాణానికి రక్షణగా వెళ్లారు. డ్యూటీలో ఉన్న జనార్ధన్ సోనావేని అనే జవాను మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబుపై దురదృష్టవశాత్తు అడుగేశాడు. వెంటనే అది పేలడంతో అతని కాలికి తీవ్రగాయాలయ్యాయి.
మావోయిస్టుల కీలక సమావేశం
సుక్మా జిల్లా బైలడిల్లా సమీపంలోని ఎతె్తైన పర్వతాల్లో మావోయిస్టు అగ్రనేతల సమావేశం జరిగినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఎల్‌ఓఎస్, ఎల్‌జీఎస్ కమాండర్లు ఈ సమావేశంలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి, మే నెలల మధ్య మావోయిస్టుల టీసీఓసీ (టెక్నికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్) జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై ఛత్తీస్‌గఢ్ పోలీసు ఉన్నతాధికారులు సైతం వివరాలు సేకరిస్తున్నారు.