బిజినెస్

భారత్‌లో వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దావోస్, జనవరి 23: దేశ జిడిపి వృద్ధిరేటు పరుగులు పెడుతుందని, సంస్కరణలు కొనసాగుతాయని ప్రపంచ ఆర్థిక మండలి (డబ్ల్యుఇఎఫ్) వేదికగా విశ్వాసం వ్యక్తం చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. తమ ప్రభుత్వ కీలక సంస్కరణ ‘వ్యాపార నిర్వహణ సులభతరం’ మాత్రం ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదన్నారు. గత ఏడాది భారత్‌లో వ్యాపార నిర్వహణ మెరుగుపడిందని అంతర్జాతీయ గణాంకాలు తేటతెల్లం చేసిన విషయాన్ని గుర్తుచేసిన జైట్లీ.. ఈ విషయంలో భారత్ చాలా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం ఇక్కడ డబ్ల్యుఇఎఫ్ వార్షిక సమావేశంలో ‘ది గ్లోబల్ ఎకనామిక్ ఔట్‌లుక్’ అన్న అంశంపై జైట్లీ మాట్లాడారు. సంస్కరణల ప్రక్రియకు భారత్‌లో ప్రతిపక్షాలు అడ్డుతగులుతున్నాయన్న ఆయన అయినప్పటికీ తాము తీసుకురావాలన్న సంస్కరణలను తెచ్చే తీరుతామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)ను త్వరలోనే ఆచరణలో పెడతామన్న ధీమాను కనబరిచారు.
భారత్ అవకాశాలపై ఆశాభావం
ఐదు రోజుల డబ్ల్యుఇఎఫ్ సమావేశంలో చివరి రోజైన శనివారం భారత్ తరఫున సమావేశానికి హాజరైన ప్రభుత్వాధినేతలు, వ్యాపారవేత్తలు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ స్థానం, అవకాశాలపై ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలను చైనా ఆర్థిక పరిస్థితులు కలవరపెడుతున్న నేపథ్యంలో చైనా సభ్య దేశంగా ఉన్న బ్రిక్స్ దేశాల కూటమిపై ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నా, దాన్ని తట్టుకుని భారత్ వృద్ధిపథంలో పయనిస్తోందని అన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) చీఫ్ క్రిస్టినా లగార్డే సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. బ్రిక్స్ దేశాల్లో భారత్ జిడిపి ప్రగతి పథంలో ఉందన్నారు. ఇదే సమయంలో లగార్డేతోపాటు బ్రిటన్ చాన్స్‌లర్ జార్జ్ ఆస్బర్న్ ఇతర దేశాధినేతలు చైనా త్వరలో కోలుకుంటుందన్న విశ్వాసాన్ని కనబరిచారు. కాగా, భారత ఆర్థిక వ్యవస్థ పురోగతి కారకాలు విస్తరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా జైట్లీతోపాటు వ్యాపారవేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ప్రగతి సేవా రంగంపైనే ఆధారపడి ఉందని, ఉత్పాదక రంగం కూడా పుంజుకోవాల్సిన అవసరం చాలా ఉందని దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ చీఫ్ చందా కొచ్చర్ అన్నారు. దీనివల్ల దేశంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. కాగా, కీలక సంస్కరణల అమలుపై మదుపరులు ఆందోళన వ్యక్తం చేస్తుండటంపై అడిగిన ప్రశ్నకు బదులుగా ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చితే భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉందని గుర్తుచేశారు. వృద్ధి దోహద నిర్ణయాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ క్రమంలో భారత్‌లో పెట్టుబడులు పెట్టి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని డబ్ల్యుఇఎఫ్ వేదికగా భారతీయ బృందం విదేశీ మదుపరులను కోరింది.