ఆంధ్రప్రదేశ్‌

భక్తుడి చెంతకే భగవంతుడి ఆశీస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23 : ‘్భక్తుడి చెంతకే భగవంతుడి ఆశీస్సులు’ పేరుతో ఎపి దేవాదాయ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు శనివారం సచివాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, ఏడు రకాల కార్యక్రమాలకు పూజారులే భక్తుల ఇళ్లకు వెళ్లి భగవంతుడి తరఫున ఆశీస్సులు అందిస్తారని వివరించారు. జన్మదినం, నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, వివాహం, శ్రీమంతం, మరణం సందర్భాలలో పూజారులే భక్తుల ఇళ్లకు వెళతారని తెలిపారు. ఆ యా సందర్భాలలో అవసరాన్ని బట్టి కార్యక్రమ సామాగ్రిని తీసుకువెళ్లి, భక్తుల అభీష్టం మేరకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. ఆలయాల అభివృద్ధికి శాస్త్ర సాంకేతిక రంగాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటామని మంత్రి చెప్పారు. దేవాలయాల్లో భక్తులకు ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే దేవాదాయ శాఖకు సమాచారం ఇచ్చే ఏర్పాట్లు చేశామన్నారు. ఇందుకోసం టోల్‌ఫ్రీ నెంబర్ (1800 425 6656) ను ఏర్పాటు చేశామని వివరించారు. దేవాలయాల గురించి వివరాలు తెలుసుకునేందుకు ఆన్‌లైన్ విధానాన్ని ప్రారంభించామన్నారు. దేవాలయాల భూములను వెబ్‌సైట్‌లో ఉంచుతున్నామని తెలిపారు. కృష్ణాపుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. 2016 ఆగస్టు 12 నుండి 23 వరకు పుష్కరాలు ఉంటాయని వివరించారు. కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పుష్కరాలకు సంబంధం ఉన్న దేవాలయాలు 326 ఉన్నట్టు గుర్తించామన్నారు.