జాతీయ వార్తలు

బాల బాంబర్లతో మోదీపై గురి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 24:రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఆత్మాహుతి దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. మోదీపై 12-15 సంవత్సరాల పిల్లల్లే ఆత్మాహుతి బాంబర్లుగా ప్రయోగించే అవకాశం ఉందని స్పష్టం చేశాయి. ఆయుధాలు, పేలులు పదార్థాల్ని ఉపయోగించడంలో శిక్షణ పొందిన 12-15 సంవత్సరాల పిల్లలు ఇప్పటికే సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించి ఉండవచ్చునని కూడా వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఎన్‌సిఆర్ పోలీసులు, నిఘా విభాగాలు మరింతగా భద్రతా చర్యల్ని బలోపేతం చేశాయి. గత ఏడాది గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తన భద్రతా సిబ్బందిని పక్కన పెట్టి స్కూలు పిల్లల్ని పలుకరించేందుకు కారుదిగి వెళ్లిన సంఘటనను ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ సందర్భంగా గుర్తు చేశాయి. బాల ఆత్మాహుతి దళాలకు స్కూలు యూనిఫాం వేసి ప్రధానిపై ఆత్మాహుతి దాడికి ఒడిగట్టేందుకు ఐసిస్ ప్రయత్నించే అవకాశం ఉందని తెలిపాయి. ఇంటెలిజెన్స్ వర్గాలు సేకరించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు ‘ఎస్‌పిజి రక్షణ వలయం నుంచి బయటికి వెళ్లకండి’అని ప్రధాని మోదీకి స్పష్టం చేశాయి. మిషన్ గన్‌లు, రాకెట్ లాంచర్ల వినియోగంలో పిల్లలకు శిక్షణ ఇస్తున్నట్టుగా ఐసిస్ ఇటీవల ఓ వీడియోను కూడా విడుదల చేసింది.