రాష్ట్రీయం

భద్రాద్రి రామయ్యకు నృత్యాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జనవరి 24: ఖమ్మం జిల్లా భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి సన్నిధిలోని మిథిలా స్టేడియం సమీపాన స్వామి ఉత్తరద్వారంలో ఆదివారం తెలుగు రాష్ట్రాల చిన్నారులు భక్తరామదాసు కీర్తనలకు అనుగుణంగా రామయ్యకు నృత్యాభిషేకం చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కించుకున్నారు. గతంలో అన్నమయ్య కీర్తనలకు నృత్యాలు చేసిన చిన్నారులు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో నమోదయ్యారు. వాగ్గేయకారుడు భక్తరామదాసు రచించిన కీర్తనలకు నృత్యాలు చేయడం ఇదే ప్రథమం. సుమారు 1100 మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన చిన్నారులు ‘అదిగో భద్రాద్రి... ఇదిగో గౌతమి చూడండి’, ‘పలుకే బంగారమాయెరా... సీతమ్మ తల్లి’, ‘చరణములే నమ్మితి...’ అనే మూడు కీర్తనలకు వీరంతా 13 నిముషాల 39 సెకన్లలో నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపకులు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి మాట్లాడుతూ తాము చేసిన కార్యక్రమంలో తప్పులు పరిశీలించి 85 శాతం చక్కగా ఉంటేనే ఎంపిక చేస్తామన్నారు. కానీ 100 శాతం చక్కగా చిన్నారులు నృత్యం చేసి అబ్బుర పరిచారని ప్రశంసించారు. చిన్నారుల ప్రతిభకు ఏకకాలంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సుతో పాటు తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్సు, వరల్డ్ సూపర్ కిడ్స్ ఆఫ్ రికార్డ్సుల్లో కూడా చోటు దక్కింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సు సర్ట్ఫికేట్లు పోస్టల్‌లో పంపనున్నారు. ప్రతినిధులు తమ బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు కల్పిస్తూ నిర్వాహకులకు పత్రాలను అందజేశారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, తాళ్లూరి పంచాక్షరయ్య, పాకల దుర్గాప్రసాద్, చావా లక్ష్మీనారాయణ, నిర్వాహకులు బెక్కంటి శ్రీనివాసరావు వాటిని అందుకున్నారు. చిన్నారులు పత్రాలతో నృత్యాలు చేసి సందడి చేశారు. అంతకు ముందు ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ డిజిపి గోపీనాథ్‌రెడ్డి, భద్రాచలం ఎంపీపీ ఊకే శాంతమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి రికార్డు పోటీని ప్రారంభించారు.