రాష్ట్రీయం

బాక్సైట్ జీవో రద్దుకు ఐక్య ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 24: బాక్సైట్ తవ్వకాలను ఐక్య పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని ఎపి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు పిలుపునిచ్చారు. ఆదివారం విశాఖలో ‘బాక్సైట్ తవ్వకాలు-గిరిజనుల భవితవ్యం’ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాన్ని మరింత విస్తృతపరిచేందుకు గిరిజనులంతా కదలి రావాలన్నారు. బాక్సైట్ తవ్వకాలు చేపడితే గిరిజనులకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పడంలో మోసం తప్ప వాస్తవం లేదనేది దమన్‌జోడి నాల్కో కంపెనీలో గిరిజనుల ఉపాధిని పరిశీలిస్తే అర్ధమవుతుందన్నారు. బాక్సైట్ తవ్వకాలు అన్‌రాక్ కంపెనీ యజమాని లాభాల కోసం తప్ప గిరిజనుల ప్రయోజనం కోసం, జాతి ఉద్ధరణకు కాదన్నారు. వీటి తవ్వకాలతో ఆర్థిక, సామాజిక, పర్యావరణపరంగా గిరిజన ప్రాంతానికి తీవ్ర హాని కలుగుతుందన్న నిపుణుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, ఐదో షెడ్యూల్‌లో గిరిజన ప్రయోజనాలను పరిరక్షిస్తూ రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయని విమర్శించారు.