జాతీయ వార్తలు

బెంగాల్‌లో దేనికీ భద్రత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 21: పశ్చిమ బెంగాల్‌లోని మాల్డాలో ఇటీవల జరిగిన హింసాకాండపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబడుతూ, రాష్ట్రంలో ‘మా- మాటి-మనుష్’ (తల్లి, మట్టి, ప్రజలు)కు భద్రతే లేదన్నారు. ఈ మఃడింటికి రక్షణ కల్పిస్తామన్న నినాదంతోనే తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. బెంగాల్‌లోని బారాసత్ ప్రాంతంలో గురువారం జరిగిన ఒక ర్యాలీలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ మమతా బెనర్జీ ప్రభుత్వం సుపరిపాలనను అందించి, శాంతిభద్రతలను మెరుగుపరచి, అభివృద్ధిలో నూతన శకాన్ని ప్రారంభించేంతవరకు పశ్చిమ బెంగాల్‌లో ఎవరు కూడా పెట్టుబడులు పెట్టరన్నారు.
మాల్డాలో ఇటీవల ఆందోళనకారులు ఒక పోలీసు స్టేషన్‌కు నిప్పు పెట్టడంతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. కాగా, ఈ హింసాకాండపై దర్యాప్తుకోసం ఒక అధికారుల బృందాన్ని పంపించాలని బిజెపి కేంద్రాన్ని డిమాండ్ చేసింది. అయితే మాల్డా హింసాకాండపై అధ్యయనానికి పశ్చిమ బెంగాల్‌కు ఎలాంటి అధికారిక బృందాన్ని పంపించరాదని కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ అగ్రనాయకుడొకరు తెలిపారు. మాల్డా హింసాకాండను బిఎస్‌ఎఎఫ్‌కు, స్థానికులకు మధ్య జరిగిన ఘర్షణగా మమత అభివర్ణించగా, తృణమూల్ కాంగ్రెస్ పాల్పడుతున్న సంఘ వ్యతిరేక కార్యకలాపాలను కప్పి పుచ్చుకోవడానికి ఆ పార్టీయే ఈ హింసాకాండ జరిపించిందని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తూ, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.