శ్రీకాకుళం

బారువ ‘మహోదయం’కు పక్కాగా ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోంపేట, జనవరి 24: బారువ మహేంద్రతనయ నది సంగమం వద్ద ఫిబ్రవరిలో 7,8 తేదీల్లో జరిగే మహోదయ కార్యక్రమానికి పక్కాగా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీనృసింహం, జిల్లా ఎస్పీ ఖాన్‌లు ఆదేశించారు. ఆదివారం బారువ తీరంలో 14 శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా నుంచేకాకుండా పక్కా రాష్టమ్రైన ఒడిశా నుంచి కూడ వేలాది మంది భక్తులు ఈ మహోదయం కార్యక్రమంలో పాల్గొనేందుకు రానున్నట్టు తెలిపారు. తీరంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా దగ్గరుండి అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఫిబ్రవరి 7వ తేదీ రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు 8వ తేది రాత్రి 10వ తేదీ వరకు మహోదయం ఉంటుందని, 200 మంది గజ ఈతగాళ్లును, 100 నుంచి 200 మంది వేదపండితులను సిద్ధం చేసినట్టు చెప్పారు. తీరంలో లోతైన ప్రదేశాలను ముందుగా గుర్తించి అక్కడే సంప్రదాయ పడవలు, తెప్పలు ఏర్పాట్లు చేయాలని మత్స్యశాఖకు ఆదేశించారు. ప్రతి వంద మీటర్లుకు తాత్కాలిక కర్టెన్లు, పురుషులు, మహిళలకు మరుగుదొడ్లు వేర్వేరుగా కేటాయించేలా సదుపాయాలు కల్పించాలన్నారు. పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలకు చెందిన సిబ్బందిని దీనికి వినియోగించుకోవాలన్నారు. బారువ కూడలి నుంచి భక్తుల తాకిడి అధికంగా ఉంటున్నందున ట్రాఫిక్‌ను అక్కడే క్రమబద్ధీకరించి వయోవృద్ధులు, పిల్లలకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇచ్ఛాపురం, పలాస ఎమ్మెల్యే అశోక్, శివాజీ, దేవాదాయ ఆసిస్టెంట్ కమిషనర్ శ్యామల, జడ్‌పిటిసి, ఎంపిపి, చంద్రమోహన్, శ్రీనివాసరావు, సోంపేట తహశీల్దార్ గోపాలరత్నం, అధికారులు పాల్గొన్నారు.
నిఘా!
ఆంధ్రభూమి బ్యూరో-శ్రీకాకుళం
పొరుగు జిల్లాపై ఉగ్రవాదుల ముప్పు ఉందన్న ఐబి సంకేతాన్ని అందుకున్న ఆర్‌పిఎఫ్ భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వరకూ జాతీయ రహదారి తనిఖీలు ముమ్మరం చేసింది. మధ్యలో జిల్లాలో జాతీయరహదారి-16కు ఆనుకుని గల కొన్ని అనుమానిత గ్రామాల అనుకుని ఉన్న హైవేపై ఆదివారం ఆర్‌పిఎఫ్ ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. కేవలం ఉగ్రవాదులకు సాయం చేసే కొంతమంది సానుభూతిపరులు సిక్కోల్ హైవేకు దగ్గర్లో గల కొన్ని గ్రామాల్లో ఉంటున్నారని, అక్కడ ప్రార్థనామందిరాల్లో తలదాచుకుంటున్నారన్న చరిత్రకు కేంద్ర ప్రభుత్వ రక్షణ దళం భూతద్ధం పట్టి పసిగడుతోంది. గతంలో షికార్లు చేసిన ఈ పుకారుల్లో ఎంతవాస్తవం, అవాస్తవమో తెలియదుగాని, కొనే్నళ్ళుగా జిల్లా పోలీసు నిఘా విభాగం మాత్రం నిద్దురపోయిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో ఫిబ్రవరి మొదటివారంలో జరిగే నేవీ ఫెస్టివల్‌కు సుమారు 50 దేశాలకు చెందిన అతిథులు విచ్చేస్తున్న సమయం కావడంతోపాటు, దేశ ప్రధాని, రాష్టప్రతి విశాఖలో రెండురోజులు బసచేసే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల మధ్య రిప్లబిక్‌డే రోజున ఉగ్రవాదుల హెచ్చరికలు మొత్తంగా జిల్లాలో నివురుగప్పిన నిప్పులా నిఘా పనిచేస్తోంది.
విశాఖలో ఔట్‌పోస్టులు, ఎక్కడక్కడ ప్రత్యేక కేంద్ర దళాల నిఘా పెరిగినప్పటికీ, పక్కనే 80 కిలోమీటర్లు దూరంలో గల శ్రీకాకుళం జిల్లాలో మాత్రం కేంద్రం సూచించినంతగా నిఘా లేదనే చెప్పాలి. కొన్ని సంప్రదాయాలకు ప్రజలు పోలీసుల చర్యల వలన దూరమవ్వాల్సిన పరిస్థితి నెలకొంటుందన్న విమర్శలు జిల్లాఅంతటా విన్పిస్తున్నాయి.
ఇక అడపా దడపా కార్డెన్‌శక్తిపేరుతో తనిఖీలు నిర్వహించినా ఫలితాలు మాత్రం పోలీసుల హడావుడే తప్ప ఒరిగిందేమీ లేదు. మొన్నటివరకు ప్రపంచానికే సవాళ్లుగా మారిని తీవ్రవాదుల భయం భారతదేశానికి కూడా వ్యాపించింది. గత రిపబ్లిక్‌డే వేడుకలను భగ్నం చేయడానికి దేశంలో పలు ప్రాంతాల్లో ఐసిస్ తీవ్రవాదులు తిష్ఠవేయడంతో వారి కదలికలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించి పలువురును అదుపులోనికి తీసుకున్న విషయం తెలిసిందే. గతంలో ఎక్కడో ఏదో జరిగినా జిల్లాలో వాహనాల రాకపోకలపైనా అనుమాన స్థావరాలపైనా తనిఖీలు చేసేవారు. అయితే ఇటీవల కాలంలో పోలీసులు ఆ విషయమే మర్చిపోయారు. తీవ్రవాదులకు ఇతర అసాంఘిక కార్యకలాపాలు సృష్టించే వారికి జిల్లా స్థావరంగా ఉందని గతంలో నిఘా వర్గాలు హెచ్చరికలు చేశాయి. ఒక సామాజిక వర్గానికి చెందిన మతస్థులు ఇతర ప్రాంతాల నుండి ఎక్కువగా జిల్లాకు వస్తున్నారు. వారి సామాజిక మతానికి చెందిన ప్రార్థనమందిరాలలో తలదాచుకుంటూ సంఘవిద్రోహక చర్యలకు వ్యూహరచన చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పటికీ, పోలీసుయంత్రాంగం కనీసం అటువైపునకు పోవటంలేదు. జిల్లాలో ప్రధానంగా రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, నరసన్నపేట, కాశీబుగ్గ, ఇచ్ఛాపురం, రాజాం, పొందూరు ప్రాంతాల్లో ఉన్న ప్రార్థన మందిరాలకు ఇతర ప్రాంతాల వారు ఎక్కువగా వస్తున్నారు. వీరంతా ఇతరరాష్ట్రాలు, జిల్లాలకు చెందినవారే. ఇలా ఇతర ప్రాంతాల వారు వచ్చేవారు తమ సంప్రదాయం ప్రకారం ఒక ప్రార్థనామందిరం నుండి మరోప్రార్థనామందిరానికి వెళ్లి కొన్ని రోజులుగడుపుతామని ఇది తమ సంప్రదాయమని చెబుతున్నారు. అయితే, ఇందులో తమ సంప్రదాయ ప్రకారం అయితే ఎవ్వరూ భయపడాల్సిన అవసరంలేదు. ఇటీవల కాలంలో సంప్రదాయ ముసుగులో
అసాంఘిక శక్తులు చొరబడుతున్నారని నిఘా వర్గాల హెచ్చరికలు కూడా జిల్లా వాసులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.
గతంలో పశ్చిమబెంగాల్‌కు చెందిన మావోయిస్టులు అక్కడి నుండి పారిపోయి పైడి భీమవరంలో ఉన్న పరిశ్రమలో పనుల కోసం వచ్చేశారు. అప్పట్లోనే పశ్చిమబెంగాల్ పోలీసులు వచ్చి స్థానిక పోలీసుల సహకారంతో వారిని అదుపులోనికి తీసుకునివెళ్ళారు.
అదే విధంగా బంగ్లాదేశ్‌కు చెందిన వారు కూడా చేపల వేటకు వచ్చి దారితప్పి జిల్లాలో పర్యటించిన సంఘటనలూ ఉన్నాయి. ప్రస్తుతం ఐసిస్ తీవ్రవాదుల ముప్పు ఎక్కువగా ఉన్నందున వారి సానుభూతి స్థావరాల పట్ల నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇదిలా ఉండగా, జిల్లాలో ప్రత్యేక నిఘా బృందాలు జాతీయరహదారిపై నాకాబందీ నిర్వహిస్తున్నట్టు జిల్లా పోలీసు ఉన్నతాధికారి ‘ఆంధ్రభూమి’కి చెప్పారు. విశాఖపట్నంలో నెవీ ఫెస్టివల్ ముగిసినంతవరకూ జిల్లాపై ప్రత్యేక నిఘా ఉంటోందని, అనుమానితులు సంచరించినట్టు తెలిస్తే వెంటనే స్థానికంగా గల పోలీసుస్టేషన్‌కు సమాచారం ఇచ్చి పోలీసులను సహకరించాలని ఎస్పీ కోరారు. అంతేకాకుండా, ప్రత్యేక చర్యల్లో భాగంగా నిర్వహించనున్న తనిఖీలను జిల్లా ప్రజలు సహకరించి ఎటువంటి అసాంఘికశక్తులు చొరబడకుండా తమవంతు సాయం అందించాలని ఎస్పీ ప్రజలను కోరారు.

ఓటు ప్రాధాన్యాన్ని గుర్తించాలి

బలగ, జనవరి 24: ఓటు ప్రాధాన్యతను ప్రతీ ఒక్కరూ గుర్తించాలని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కార్యక్రమంలో భాగంగా జాయింట్ కలెక్టర్ ఎలెవెన్, ప్రెస్ ఎలెవెన్‌కు మధ్య ఆదివారం ఉదయం 16 ఓటర్ల క్రికెట్ మ్యాచ్ స్థానిక ప్రభుత్వ పురుషుల కళాశాల మైదానంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, ఎస్పీ ఎఎస్ ఖాన్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు బలీయమైన శక్తిగా దేశంలో ఉన్నారని తద్వారా ప్రజాస్వామ్యం ఫరిడిల్లుతుందని చెప్పారు. ఓటరు ప్రలోభాలకు గురై నగదు, మద్యం వంటి పదార్థాలకు బహుమతిగా ఓటును ఇస్తున్నారన్నారు. ఇటువంటి విధానాల వల్ల భవిష్యత్‌లో ఓటరు నష్టపోతారన్నారు. స్వేచ్ఛగా ఓటు వేయాలన్నారు. ప్రలోభాలకు, మతాలకు లొంగరాదని బలం ఉపయోగించి ఓట్లు వేయించుకునేవారిపై ఓటింగ్ జరిగే రోజుల్లో పోలిస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందన్నారు. భారత ఎన్నికల సంఘం సర్వస్వతంత్య్ర వ్యవస్థగా ఉంటూ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తుందని తెలిపారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం 6:30గంటల నుండి కోడిరామ్మూర్తి స్టేడియం నుండి శోభాయాత్ర ప్రారంభవౌతుందని తెలిపారు. అనంతరం బాపూజీ కళామందిర్‌లో సభ జరుగుతుందన్నారు. కొత్తగా ఓట్లను నమోదు చేసుకున్న 10,890మంది యువతకు ఓటరు గుర్తింపు కార్డు అందజేస్తామని తెలిపారు. ప్రతీ ఒక్క ఓటరు ఓటుని వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్, ఆర్డీవో బి.దయానిధి, తహశీల్దార్ సుధాసాగర్, జాయింట్ కలెక్టర్ ఎలివెన్, ప్రెస్ ఎలివెన్, క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారు.

లింగ వివక్ష సమాజానికి చేటు!
శ్రీకాకుళం(టౌన్), జనవరి 24: పురుషుల కంటే స్ర్తిలు అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉంటున్నారని, అయితే లింగ వివక్ష తల్లిదండ్రుల్లో పోయిననాడే సమాజంలో మార్పు వస్తుందని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి అన్నారు. లింగ వివక్ష సమాజానికి చేటు కలిగిస్తుందన్నారు. సమాజంలో స్ర్తిని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదని, అవసరమైతే సబలగా మారి తాను అబల కాదు అని నిరూపించుకునే శక్తి స్ర్తికి ఉందని అన్నారు. ఆదివారం స్థానిక బాపూజీ కళామందిర్‌లో జిల్లా స్ర్తి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ బాలికా దినోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆదిశక్తిగా కొలిచే స్ర్తిని అబలగా చూడరాదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ మనమీద మనకు నమ్మకం ఉండి ముందుకు సాగాలని ఆమె బాలికలకు
పిలుపునిచ్చారు. బాలికలకు తల్లిని మించిన స్నేహితురాలు ఉండదని పేర్కొన్నారు. ఎంతటి సమస్యనైనా తల్లితో బాలికలు పంచుకున్న నాడు సమాజంలో బాలికలు అన్ని రంగాల్లో ఉన్నత స్థానంలో నిలుస్తారని పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం మాట్లాడుతూ జిల్లాలో 20 ఏళ్ల గణాంకాలు పరిశీలిస్తే పురుషుల కంటే మహిళల సంఖ్య తక్కువగా ఉంటుందని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలోనే ఉన్న గర్భనిరోధక లింగ నిర్థారణ చట్టం సక్రమంగా అమలు జరుగకపోవడమే ఇందుకు కారణమన్నారు. ఆడపిల్లల పట్ల వివక్ష ముందుగా తల్లిదండ్రుల నుండి పోవాలన్నారు. అనంతరం సభకు హాజరైన బాలికలతో వారి హక్కులపై మాట్లాడించారు. ముందుగా బాలికలు ప్రదర్శించిన నృత్యరూపకాలు పలువురిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎ.ఎస్.ఖాన్, డిఈవో డి.దేవానందరెడ్డి, ఆర్‌వియం డిసిడివో నీరజ తదితరులు పాల్గొన్నారు.

భారతీయ సంగీతాన్ని ప్రోత్సహించాలి

శ్రీకాకుళం(కల్చరల్), జనవరి 24: భారతీయ సంస్కృతికి మూల స్తంభాలైన కర్ణాటక, హిందుస్థానీ శాస్ర్తియ సంగీతాలకు ప్రోత్సాహం ఎంతైనా అవసరమని జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ అన్నారు. మిత్ర సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో స్థానిక బాపూజీ కళామందిరంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన హిందుస్థానీ సంగీత సభలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి యువతరానికి వారసత్వంగా శాస్ర్తియ సంగీత మాధుర్యాన్ని అందించి ఆదిశలో వారిని ఆకట్టుకోవాలన్నారు. నక్క శంకరరావు అధ్యక్షతన జరిగిన ఈ సంగీత సభలో నిక్కు అప్పన్న, ఇప్పిలి శంకరశర్మ, గీతా శ్రీకాంత్, పులఖంఢం శ్రీనివాసరావు పాల్గొన్నారు.
వేణుగాన సమ్మోహనం: బెనారస్‌కు చెందిన సనీస్‌గ్యావెలీ తొలుత తన వేణుగానంతో శ్రోతలను రంజిపంజేశారు. రాగసరస్వతి, ఆలాప్, జోడ్‌జ్యాల, రూపకతాళం, తీన్‌తాల్‌ల్లోని స్వరాలను వేణువుపై పలికించి అలరించారు. తబలాపై చందన్ విశ్వకర్మ సహకరించారు. అనంతరం జరిగిన అంబరీస్ చంచల్ గాత్ర కచేరీలో జై దుర్గే దుర్గతి భజన, యమన్, కలాశ్రీ రాగ్, తుమ్రి కీరవాణి అలాపనలు వీనుల విందు చేశాయి. హార్మోనియంపై ఇంద్రదేవ్‌చౌదరి, తబలాపై పంకజ్‌రాజు సహకరించారు. ఇదిలా ఉండగా అనివార్య కారణాల వల్లన చివరి నిముషంలో అంకూర్‌మిశ్రా సితార వాదన జరగలేదు.
అమిత్ షా హయంలోనే బిజెపి బలోపేతం

శ్రీకాకుళం(రూరల్), జనవరి 24: భారతీయ జనతాపార్టీ అఖిల భారత అధ్యక్షునిగా అమిత్ షా రెండోసారి ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. అమిత్ షాహయాంలోనే బిజెపి బలపడి 2014 ఎన్నికల్లో విజయం సాధించిందని ఆ పార్టీ రాష్టక్రార్యదర్శి పైడి వేణుగోపాలం అన్నారు. యుపి ఏ ప్రభుత్వ హయాంలో అనేక ఆరోపణలకు గురై పోలీస్ విచారణకు హాజరై మూడు నెలల పాటు జైలుకు కూడా వెళ్లారని తెలిపారు. ఉత్తరప్రధేశ్ ఇంచార్జ్‌గా ఉంటూ 73 సీట్లు గెలిపించిన ఘనత అమిత్‌షాకు దక్కిందన్నారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల్లో బిజెపి విజయదుందుబిని మోగించిందన్నారు. కేరళ, అసోం, తమిళనాడురాష్ట్రాల్లో శక్తిని పెంచుకునేందుకు కృషి చేస్తుందన్నారు. దేశాభివృద్ధితోపాటు బిజెపి బలపడుతుందని తెలియజేశారు. అమిత్ షా నాయకత్వాన్ని జిల్లా శాఖ సమర్థిస్తూ హర్షం వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయణరావు, మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొద్ద్భుగ్యలక్ష్మీ, నగర అధ్యక్షులు చల్లా వెంకటేశ్వరరావు, సంపతిరావు నాగేశ్వరరావు, తమ్మినేని పురుషోత్తం, కద్దాల ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
అబ్దుల్ కలాం విగ్రహావిష్కరణ
సారవకోట, జనవరి 24: మండలంలోని బుడితి ఉన్నత పాఠశాల ఆవరణంలో దివంగత రాష్ట్ర పతి ఏపిజె అబ్దుల్ కలాం విగ్రహాన్ని పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పొన్నాన బాలకృష్ణంనాయుడు ఆదివారం ఆవిష్కరించారు. ఈ పాఠశాలలో 1974-75 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిని పూర్వవిద్యార్థులు ఆదివారం ఏర్పాటు చేసిన అపూర్వ కలయిక కార్యక్రమంలో భాగంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పొన్నాన బాలకృష్ణంనాయుడు మాట్లాడుతూ పాఠశాల ఆవరణలో పూర్వవిద్యార్థులు అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రశంసించారు. సుమారు 30మంది పూర్వవిద్యార్థులు కుటుంబసమేతంగా పాల్గొని వారి వివరాలను పరస్పరం తెలియజేశారు. పూర్వవిద్యార్థులు అప్పటి గురువులకు ఘనంగా సన్మానించారు. అబ్దుల్ కలాంపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన ఉపన్యాసపు పోటీలలోవిజేతలకు ఆహుతులు బహుమతులు అందజేశారు.

ఇసుక రీచ్‌లకు రాని అనుమతులు... తలలు పట్టుకున్న ‘తమ్ముళ్ళు’
ఎచ్చెర్ల, జనవరి 24: జిల్లాలోని వివిధ ఇసుక రీచ్‌లకు వేలం పాటలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వసిద్ధంచేసింది. అయితే, నాగావళి నదికి ఆనుకొని ఉన్న తోటపాలెం, పొన్నాడ, ముద్దాడపేట, బొంతలకోడూరు వద్ద ఇసుక తవ్వకాలకు సంబంధిత అధికారుల బృందం అనుమతులు ఇవ్వకపోవడంతో వేలం పాటల జాబితాలో ఈ రీచ్‌లకు చోటు దక్కలేదు. దీంతో వీటిపై ఆశలు పెంచుకున్న తెలుగుతమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. డిఆర్‌డిఏ అధికారులు నిన్నమొన్నటివరకు విశాఖ మహానగరంతోపాటు జిల్లా శ్యాండ్ బ్యాంకుకు పొన్నాడ కేంద్రంగా ఇసుకను గ్రామైఖ్య సంఘం నేతృత్వంలో విక్రయించిన విషయం తెలిసిందే. అటువంటి రీచ్‌ని కూడా వేలం పాటకు అనుమతివ్వకపోవడం అధికార పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. రూ.500లకు క్యూబిక్ మీటర్ల ధర తగ్గడం మరింత అనుకూలంగా ఇసుక వ్యాపారం సాగించవచ్చునని ఈ రీచ్‌లపై ఎన్నో ఆశలు పెంచుకున్నప్పటికీ కమిటీ ప్రతినిధులు మాత్రం అనుమతివ్వకపోవడాన్ని స్థానిక నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు దృష్టికి తీసుకెళ్లి గతంలో మాదిరిగా వేలంపాటలు నిర్వహించేలా ఒత్తిడి పెంచే పనిలో ఉన్నారు. జిల్లా కేంద్రంలోని హయత్‌నగరం ర్యాంపునకు లేని అభ్యంతరం తోటపాలెం, పొన్నాడ, ముద్దాడపేట, బొంతలకోడూరుకు ఏమిటని రెవెన్యూ, మైన్స్ అధికారులను తెలుగుతమ్ముళ్లు నిలదీస్తున్నారు. రీచ్‌లు వేలం పాటల వల్ల ప్రభుత్వ ఖజానాకు ఆదాయం లభించడమే కాకుండా స్థానిక కేడర్‌కు కూడా ఆర్థిక ప్రయోజనం చేకూరనుందని వారంతా గట్టిగా వాదిస్తున్నారు. తమ్మినాయుడుపేట ఇసుక రీచ్‌లకు సమీపంలో వంతెన ఉండటమే కాకుండా సిక్కోలు నగరానికి మంచినీరు అందించే మంచినీటి బావులు ఉన్నాయని అధికారులు షాక్ చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పంచాయతీలు ఆర్థికంగా నిలదొక్కుకొని పౌరులకు వౌలిక సదుపాయాలు కల్పించేందుకు కావాల్సిన ఆదాయ వనరులు ఇసుక రీచ్‌ల ద్వారా సమకూర్చాల్సి ఉన్నప్పటికీ అధికారులు మాత్రం అలసత్వం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి హయతనగరం రీచ్‌కు ఉన్నప్పటికీ అనుమతులు ఎలా ఇచ్చారని తెలుగు తమ్ముళ్లు నిలదీస్తున్నారు. ఇప్పటికైనా మండలంలోని ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలకు అనుమతులు ఇవ్వాలని స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.

సంస్థకు డ్రైవరు వెనె్నముక
శ్రీకాకుళం(టౌన్), జనవరి 24: ఆర్టీసీ సంస్థకు డ్రైవరు వెన్నుముక వంటివారని ఆర్టీసీ రెండో డిపో మేనేజరు నంబాళ్ల అరుణకుమారి అన్నారు. ఆదివారం 27వ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా డిపో పరిధిలోని డ్రైవర్ల కుటుంబాలకు ఆమె అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాధ్యతలు పెరిగినపుడు బరువులు పెరుగుతాయని, అయితే డ్రైవరు తన విధి నిర్వహణలో వత్తిడి లేకుండా ఉండాలంటే ఆయన కుటుంబ సభ్యుల బాధ్యత కూడా ఇందులో ఉంటుందని అన్నారు. సమయం విలువ పెరిగినందున, వాతావరణ పరిస్థిల కారణంగా ఉరుకులు, పరుగుల జీవితంలో భద్రతకు ప్రాధాన్యత లేకుండా పోయిందని పేర్కొన్నారు. సంస్థలో డ్రైవరు ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తనను తాను కాపాడుకుంటూ, ప్రయాణికుల రక్షణ బాధ్యతను స్వీకరిస్తూ, పాదచారుల భద్రతపట్ల అప్రమత్తంగా ఉండాల్సి ఉందన్నారు. ఆర్టీసీలో డ్రైవరు సక్రమమైన విధి నిర్వహణ ద్వారానే సంస్థకు గౌరవ మర్యాదలు చేకూరుతాయని తెలిపారు. పైగా డ్రైవరు తన విధి బాధ్యతగా నెరవేర్చిననాడు ఖర్చు, ఇందనం ఆదా ద్వారా సంస్థకు ఆదాయం చేకూర్చినవారవుతారని తెలిపారు. ఆర్టీసీ సంస్థ అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది డ్రైవరు అంటూ కుటుంబ సభ్యులకు రోడ్డు భద్రతపట్ల అవగాహన కల్పించారు. అనంతరం ఆర్టీసీ డ్రైవర్ల కుటుంబ సభ్యులకు బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్ జి.్భస్కరరావు, బి.యల్.పి.రావు పాల్గొన్నారు.

హిందూ ధర్మాన్ని నలుదిశలా వ్యాపింపజేయాలి
నరసన్నపేట, జనవరి 24: సమాజంలో నానాటికీ హిందూమతధర్మాన్ని వ్యాపింపజేయడంలో అలసత్వం భారీగానే కనిపిస్తుందని ఇతర మతస్థులు హిందువులను మభ్యపెట్టి వారివారి మతాల్లో కలుపేందుకు భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారని దీని అడ్డుకునే అవసరం ఎంతైనా ఉందని హిందూ ధర్మప్రచార పరిషత్ జిల్లా అధ్యక్షుడు పి.హటకేశం అన్నారు. ఆదివారం మండలంలోని అడివినారాయణవలస ఏర్పాటు చేసిన ధర్మప్రచార పరిషత్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో మతాల చెందినవారు హిందూ మతానికి సంబంధించిన వారిపైనే దృష్టిసారించి మత మార్పిడీలకు ఆజ్యం పోస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. దీనిని ముఖ్యకారణం హిందూ మత సాంస్కృతీలను చాటిచెప్పడంలో మనం ఘోరంగా విఫలవౌతున్నామని దీనిని నిలబెట్టేందుకు ప్రతీ ఒక్కరు ముందడుగు వేయాలని కోరారు. భారతదేశాన్ని ప్రపంచంలో ముందువరుసలో నిలబెట్టేందుకు హిందూ మతమే తమవంతుకృషిచేస్తోందని ఈ దిశగానే ప్రతీ ఒక్కరూ హిందూ మత ప్రాచుర్యాన్ని విస్తరింపజేయాలని సూచించారు. స్థానిక గ్రామంలో ఉన్న శ్రీవిఘ్నేశ్వర భజన మండలివారు తమకున్న సామర్థ్యం బట్టి హిందూ మతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఎంతో కృషిచేస్తున్నారని వారికి ప్రతీ ఒక్క హిందువూ అండదండగా నిలవాలని స్పష్టంచేశారు. అనంతరం వేద పండితులకు ఘనంగా స్థానిక భజన మండలి అధ్యక్షులు శిమ్మలక్ష్మణరావుసన్మానించారు. అలాగే ధనుర్మాసంలో శ్రీవెంకటేశ్వరస్వామివారిని తిరువీధి నిర్వహించి వచ్చిన బియ్యం, ప్రసాదాలతో అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాదిమంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.