అంతర్జాతీయం

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదాపై దేశద్రోహం కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, జనవరి 25: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి బేగం ఖలీదా జియా (70)పై సోమవారం దేశద్రోహ కేసు నమోదైంది. పాకిస్తాన్ నుంచి విముక్తికోసం 1971లో జరిగిన యుద్ధంలో అమరులైనవారి గురించి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై ఈ కేసు దాఖలైంది. దీంతో ఖలీదా జియాను తమ ఎదుట హాజరు కావలసిందిగా ఆదేశిస్తూ ఢాకాలోని ఒక కోర్టు సమన్లు జారీ చేసింది. ఖలీదా జియాను అరెస్టు చేయాలన్న ప్రార్థనలతో పాటు సోమవారం ఉదయం ఆమెపై ఢాకాలోని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలైందని, దీనిపై కోర్టు స్వల్ప విచారణ జరిపి దేశద్రోహ అభియోగాన్ని ఎదుర్కొనేందుకు మార్చి 3వ తేదీలోగా తమ ఎదుట హాజరు కావలసిందిగా ఆదేశిస్తూ ఖలీదా జియాకు సమన్లు జారీ చేసిందని న్యాయస్థాన అధికారి ఒకరు పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. 1971లో జరిగిన యుద్ధంలో అమరులైన వారి సంఖ్యపై ఖలీదా జియా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై ఈ కేసు దాఖలైందని మరో అధికారి వివరించారు. పాక్ నుంచి విముక్తికోసం జరిగిన యుద్ధంలో అమరులైనవారి సంఖ్యపై అనుమానాలున్నాయని ఖలీదా జియా గత ఏడాది డిసెంబర్ 21వ తేదీన ఒక చర్చా కార్యక్రమంలో వ్యాఖ్యానించడంతో దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతోంది. పాక్‌తో యుద్ధాన్ని వ్యతిరేకించిన చాందసవాద జమాతే ఇస్లామీకి ఖలీదా జియా నేతృత్వంలోని బిఎన్‌పి (బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ) కీలక మిత్రపక్షంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.