జాతీయ వార్తలు

బడ్జెట్ భేటీలోగా.. ఏపికి హోదాపై స్పష్టత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పూర్తి అయ్యేలోగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై స్పష్టత వస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి తెలిపారు.
శుక్రవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఏపికి రావల్సిన నిధుల కోసం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలుస్తూనే ఉన్నామన్నారు. 14వ ఆర్థిక సంఘం సూచనల మేరకు ఏపి లోటు బడ్జెట్‌కు విడతల వారీగా కేంద్రం నిధులను విడుదల చేస్తోందని ఆయన తెలిపారు.
పార్లమెంటులో ప్రతిపాదించనున్న బడ్జెట్‌లో 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఏపికి కేంద్రం నిధులు కేటాయిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును రానున్న మూ డు సంవత్సరాలలో పూర్తి చేసేందుకు కావల్సిన నిధుల కోసం ఆర్థిక మంత్రి తో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభమైన ప్రపం చ జీవ పరిజ్ఞాన సదస్సులో కేంద్ర మంత్రులు హర్షవర్దన్, నిర్మలా సీతారామన్ , సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని కుదిపేస్తున్న జైకా వైరస్‌పై పరిశోధనలు మన దేశంలో ప్రారంభమయ్యాయని చెప్పారు. దేశంలోకి జైకా వైరస్ రాకుండా అన్ని చర్యలు చేపట్టామని సుజనా చౌదరి భరోసా ఇచ్చారు.