బిజినెస్

బడ్జెట్ ముందస్తు కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ముందస్తు బడ్జెట్ సంప్రదింపుల్లో భాగంగా శనివారం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సమావేశం అవుతున్నారు. ఈ సందర్భంగా వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్యసభలో ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందలేకపోతున్నది తెలిసిందే. ఈ ఏప్రిల్ 1 నుంచి జిఎస్‌టి బిల్లును ఆచరణలో పెట్టాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు నిర్ణయించుకున్న క్రమంలో త్వరలో ఆమోదం పొందగలదన్న ఆశాభావాన్ని మరోసారి ఈ చర్చతో వ్యక్తం చేయాలనుకుంటున్నారు జైట్లీ. ఇకపోతే రాష్ట్రాలకు మరిన్ని నిధులు కేటాయించాలని, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పథకాల వ్యయం పెంచాలని, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిధుల కేటాయింపులుండాలని సమావేశంలో జైట్లీ దృష్టికి రాష్ట్రాల ఆర్థిక మంత్రులు తీసుకురానున్నారు.