అక్షర

బంగారు బొంగరం- బంగారమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగారు బొంగరం
-శ్రీమతి ఎడ్ల లక్ష్మి
వెల: 70 రూ.లు.,
దొరుకు స్థలం: ఎడ్లభూంరెడ్డి, ఇ.నెం.18-11, శివాజీనగర్,
పంచముఖ హనుమాన్ దేవాలయం దగ్గర, సిద్దిపేట,
మెదక్- 502103
సెల్- 8466850674, 8500306034.

మాటకన్నా కూడా పాట మనసుని కట్టేస్తుంది. అదే కదా తొలినాటి సాహిత్యం అపారమైన విజ్ఞానపు గనులైన జానపదాలతో నిండి వుంది. జోలపాటలూ, జాబిల్లి పాటలూ, ప్రకృతిని వర్ణిస్తూ పాటలు, భక్తి పాటలూ, రక్తి పాటలూ ఇలా ఎన్నో... మనసును ఆహ్లాదపరుస్తాయి. అలాగే బాలగేయాలు చిట్టి మనసులను చిటికెలో పట్టేస్తాయి.
పిట్టా, కాకీ, పిల్లీ, కోతీ, ఏనుగూ, సింహం ఇలా ఏ జంతువైనా, చీమా, దోమా ఏ చిట్టి క్రిమికీటకమైనా అమ్మ భాషలో ముద్దుముద్దుగా చెబితే, ముగ్ధలై వింటారు చిన్నారులు. మననం చేసుకుంటారు, జ్ఞాపకం వుంచుకుంటారు. ఆటల గురించి గేయాలు, పూజల గురించి గేయాలు మనం చేసే ప్రతీ పనిలోనూ లయబద్ధంగా బుచ్చిబుచ్చి గేయాలు రాయొచ్చు. అయితే, బాల సాహిత్యం రాసేవారికి, పసి హృదయాల సంగతి బాగా తెలిసి వుండాలి. ఏ విషయం చెబితే వారిలో అమితమైన స్పందన కలుగుతుందో తెలిసుండాలి. అమ్మతనం తెలిసిన ఆడవాళ్లకది ఆనందాన్నిచ్చే పని.
రచయిత్రి శ్రీమతి ఎడ్ల లక్ష్మిగారి విషయంలో ఇది నూరు శాతం కరెక్టు.
‘గట్టుమీద కప్ప పిల్ల
కలం పట్టెను
కలంపట్టిన కప్ప పిల్ల
కథలు రాసెను’ అంటూ తాను రాసినవి కప్ప చేపకి వినిపిస్తే చేపపిల్ల అవి చదివి చేప తను నీతులు బోధించిందట. ఇలా కప్పా, చేపా స్నేహం, హృదయాలను ఎంత హత్తుకుంటుందో వేరే చెప్పాలా? లక్ష్మిగారు ఇలాంటి చిట్టిపొట్టి మాటలతో రచనలు చేసి రంజింపజేశారు. మరో గేయంలో ‘బంగారు బొంగరం’లో, గిరగిరా తిరిగే బొంగరం ఎంత గొప్పదో, చక్కగా బంగారం అంత గొప్పగా రచించారు. కవితాత్మగల ఎడ్ల లక్ష్మిగారు, పిల్లల మనసులను జల్లెడపట్టిన తల్లిగా, హాయిగా నేర్చుకుని పాడే గేయాలను వంద, మనని గిరగిరా తిప్పేస్తున్నట్టు రచించారు. ప్రతీ అమ్మానాన్నా ఈ పుస్తకాన్ని వాళ్ల చిన్నారులకోసం కొని చదివించి నేర్పించాలి.

-శారదా అశోకవర్ధన్