తెలంగాణ

బాధ్యతలు స్వీకరించిన బల్దియా మేయర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: స్వరాష్ట్రంలో ఉమ్మడి రాజధానిలో కొత్త మేయర్, డిప్యూటీ మేయర్లు శుక్రవారం కొలువుదీరారు. జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో మధ్యాహ్నం పనె్నండు గంటల నలభై నిమిషాలకు మేయర్ బొంతు రామ్మోహన్ తన ఛాంబర్‌లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టగా, అంతకు ముందు పదకొండున్నర గంటలకు సమయంలో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌లు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్‌లు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎంత నిజయితీగా పనిచేశామో అంతే నిజాయితీగా గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములై, చరిత్రలో తమ పేరు నిలిచిపోయేలా సిఎం కెసిఆర్ ఇచ్చిన చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు సేవ చేస్తామని వ్యాఖ్యానించారు. పదవులను చేపట్టడంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని మేయర్ బొంతు రామ్మోహన్ వ్యాఖ్యానించారు. అన్ని శాఖ అధికారులను, అన్ని వర్గాల ప్రజలను గ్లోబల్ సిటీ అభివృద్ధిలో భాగస్వాములను చేసేలా కార్యాచరణను రూపొందిస్తామని వెల్లడించారు.