క్రీడాభూమి

భారత్‌కు పరీక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఫిట్నెస్ సమస్యతో బరిలోకి దిగని కారణంగా, సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఆసియా బాడ్మింటన్ టీం చాంపియన్‌షిప్‌లో భారత మహిళా జట్టు గట్టి సవాళ్లను ఎదుర్కోనుంది. గుత్తా జ్వాల, అశ్వినీ పొన్నప్ప, పివి సింధు, రిత్విక శివానీ గాడే, మనీష, సిక్కీరెడ్డి, పిసి తులసీ, అరతి సారా సునీల్‌తో కూడిన భారత జట్టు ఈపోటీల్లో జపాన్, సింగపూర్ కూడా పోటీపడుతున్న గ్రూప్ నుంచే బరిలోకి దిగనుంది. జ్వాల, అశ్వినీ వంటి మేటి స్టార్లు జట్టులో ఉన్నారని, ప్రత్యర్థి జట్లకు వీరు గట్టిపోటీనిస్తారన్న నమ్మకం తనకు ఉందని జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు. సైనా నెహ్వాల్ లేకపోవడం వల్ల భారత జట్టు బలహీన పడిందన్న వార్తలను అతను పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రస్తుతం జట్టులోని ప్రతి ఒక్కరూ టోర్నీ కోసం బాగా ప్రాక్టీస్ చేశారని అన్నాడు. విజయాలు సాధించే సత్తా వీరికి ఉందన్నాడు.