వరంగల్

భక్తులతో పోటెత్తిన మేడారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏటూరునాగారం,్ఫబ్రవరి 14: ఆదివాసి గిరిజన దైవాలైన శ్రీ సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. జంపన్న వాగులోకి లక్నవరం నీరు చేరుకోవడంతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, అక్కడే అమ్మవార్లకు తలనీలాలు సమర్పించి జంపన్న చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి నిలువెత్తు బంగారాలతో అమ్మవార్ల గద్దెలను చేరుకుని గిరిజన సాంప్రదాయ బద్దంగా పసుపు, కుంకుమలతో పూజించి మొక్కులు చెల్లించు కుంటున్నారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల నుండి సైతం భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుండటంతో మేడారం కిక్కిరిసిపోయంది.

మేడారం ఏర్పాట్లపై డిజిపి సంతృప్తి
ఏటూరునాగారం,్ఫబ్రవరి 14: తెలంగాణ రాష్ట్ర పోలీసు అధినేత (డిజిపి) అనురాగశర్మ ఆదివారం మేడారంను సందర్శించారు. హెలికాప్టర్‌లో మేడారం చేరుకున్న ఆయన జాతరలో భక్తులకు అందించే సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాతర ప్రాంగణాన్ని సందర్శించి భక్తులు అమ్మవార్లను దర్శించే విధానాన్ని కళ్ళారా చూసి సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన జంపన్నవాగు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఈనెల 17నుండి 20 వరకు జరిగే మహాజాతరకు అన్ని భద్రతా చర్యలు చేపట్టామన్నారు. గత పుష్కరాల అనుభవంతో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని వెల్లడించారు. జాతరలో 10వేలమంది పోలీసులు భద్రతా చర్యలు చేపట్టేందుకు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారన్నారు. గత జాతరలో టువే ట్రాఫిక్ వల్ల కొంత అంతరాయం ఏర్పడటంతో ఈసారి వన్‌వే ట్రాఫిక్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 18,19 తేదీలలో గౌరవ ముఖ్యమంత్రి మేడారం రానున్నందున ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చినట్లు తెలిపారు. ఆయన వెంట ఎడిజి రాజీవ్‌త్రివేది, ఐజి నవీన్‌చంద్, డిఐజి మల్లారెడ్డి, ఎస్పీ అంబర్‌కిషోర్ ఝా, ములుగు ఎఎస్పీ విశ్వజిత్, డిఎస్పీలు మురళి, రాజమహేంద్ర నాయక్ స్పెషల్ డిఎస్పీ దక్షిణామూర్తి ఇతర అధికారులున్నారు.

జాతరకు సర్వం సిద్ధం
*్భక్తులకు స్వాగతం పలుకుతున్న తల్లుల గద్దెలు * ఐదు గ్రామాల్లో పూర్తయిన ఏర్పాట్లు
స్టేషన్ ఘన్‌పూర్, ఫిబ్రవరి 14: ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సమ్మక్క, సారలమ్మ జాతరకు తరలి వచ్చే భక్త జనులకు మండలంలోని మిని మేడారాలుగా విలసిల్లుతున్న లింగంపల్లి, శ్రీపతిపల్లి, తాటికొండ, ఫత్తేపూర్, ఇప్పగూడెం గ్రామాలు ముస్తాబు అయ్యాయి. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే తల్లుల పండుగగా ఈనెల 16 నుండి 19 వరకు నిర్వహించే సమ్మక్క, సారలమ్మ జాతరకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి భక్తులకు స్వాగతం పలుకుతున్నారు. జాతరలో అత్యంత ప్రధానమైన మంచినీటి సమస్య లేకుండా ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో ప్రతి జాతరలో లక్షల రూపాయలు వెచ్చించి భక్తులకు తాగునీటి సమస్యను లేకుండా సంబంధిత అధికారులు కృషి చేస్తున్నారు. అంతేకాక జాతరలో విద్యుత్, వీధిలైట్లు, భక్తులు విడితి చేసేందుకు జాతర పరిసర ప్రాంతాల్లో ఉన్న భూములను చదును చేసే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మండలంలోని ఐదు గ్రామాల్లో నిర్వహించే జాతరలో అతిపెద్దదైన లింగంపల్లిలో కమిటీతో పాటు వివిధ శాఖల అధికారులు రాత్రింభవళ్ళు కృషి చేస్తున్నారు. 1992లో లింగంపల్లి గ్రామంలో ఏర్పాటైన సమ్మక్క, సారలమ్మ జాతర 11 సార్లు పండుగను పూర్తిచేసుకుని 12వ జాతరలో అడుగుపెట్టింది. ప్రతి జాతరకు లక్షల మంది భక్తులు హాజరుకాగా ఈసారి దాదాపు ఐదు లక్షల మంది భక్తులు హాజరుకానున్నట్లు కమిటి చైర్మెన్ తిరుపతి తెలిపారు. మండలంలోని ఇప్పగూడెం- కోమటి గూడెం రెండు గ్రామ పంచాయితీల ఆధ్వర్యంలో చింతగట్టు జాతరను 2000 సంవత్సరంలో ప్రారంభించారు. అప్పటి నుండి నేటి వరకు భక్తుల సౌకర్యార్ధం ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లతో జాతరను ముందుకు తీసుకెళుతున్నారు. అలాగే తాటికొండ, పత్తేపూర్ గ్రామాల్లో 2007లో సమ్మక్క, సారలమ్మ జాతరలు ప్రారంభించారు. ప్రతిసారి జాతర అంతంత మాత్రంగానే కొనసాగినప్పటికి, దేవాదుల ఎత్తిపోతల పధకంలో భాగంగా ఇరు గ్రామాల మధ్యన ఉన్న మల్లన్నగండి రిజర్వాయర్‌గా మారడంతో గోదావరి జలాల పుష్కలంగా చేరడంతో గత జాతరకు అధిక సంఖ్యలో భక్తులు హాజరైనారు. రిజర్వాయర్ మత్తడి కింది బాగంలో ఉన్న ఇరు జాతరలకు ఈసారి రెండు లక్షల మంది భక్తులు హాజరుకాగలని నిర్వాహకులు భావిస్తున్నారు. శ్రీపతిపల్లి- కొండాపూర్ గ్రామాల మధ్యన గుట్టలల్లో వెలిసిన సమ్మక్క, సారలమ్మలను పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు కొలుస్తూ వచ్చారు. 2005లో జాతరకు ఏర్పాట్లు చేయగా ఆయా గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించున్నారు. ఈనేపధ్యంలోనే ఈసారి నిర్వహించే జాతరకు అన్నిహంగులు తీర్చి దిద్దడంలో రెండు గ్రామాల ప్రజలు తలమునకలైనారు.

అందరికీ నాణ్యమైన విద్య ప్రభుత్వ బాధ్యత
* ఇంగ్లీష్ మీడియంను అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టాలి * ప్రొఫెసర్ కంచె ఐలయ్య
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, ఫిబ్రవరి 14: బడి ఈడు పిల్లలందరికి ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వం బాధ్యత అని ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు.. ఆదివారం మర్కాజీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విద్యాసదస్సుకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాట్లాడుతూ ప్రాథమిక హక్కుగా విద్యను రాజ్యాంగంలో పేర్కొన్నాగానీ అందుకోసం బడుగు బలహీన వర్గాలు పోరాటం చేయాల్సివస్తుందన్నారు. అందుకోసం ఎక్కువ డబ్బు పెట్టుబడిగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రైవేటు పాఠశాలలే నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని భ్రమలు సృష్టింపబడ్డాయని, విద్యావ్యాపారాన్ని అదుపు చేయకుండా ప్రభుత్వాలు కాలం గడుపుతున్నాయన్నారు. సామాజిక తెలంగాణ అయినా బంగారు తెలంగాణ అయినా సాధించబడాలంటే విద్యను అందరికి ఉచితంగా అందించాలన్నారు. గ్లోబలైజేషన్ యుగంలో అందరికి అన్ని అవకాశాలు అందాలంటే ఇంగ్లీష్ మీడియంను అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టాలని, కెజి తరగతులు ప్రారంభించాలని సూచించారు. దీని కోసం తెలంగాణ ప్రజల విద్యాసంస్కరణ ఉద్యమం ఆధ్వర్యంలో అన్ని శ్రేణులను కలుపుకొని ఉద్యమించాలన్నారు. పాఠశాల విద్యలో కెజి నుండి 4వ తరగతి వరకు ఒక పాఠశాల, 5 నుండి 8 వరకు మిడిల్ స్కూల్‌గా, 9 నుండి 12 వరకు సెకండరీ విద్యగా, మూడంచెల విద్యాసంస్థలు నెలకొల్పాలన్నారు.
తెలంగాణ ప్రజల విద్యాసంస్కరణ ఉద్యమం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగటి నారాయణ మాట్లాడుతూ కెజి నుండి పిజి విద్య ప్రభుత్వ యాజమాన్యంలోనే నిర్వహించాలని, వచ్చే విద్యాసంవత్సరంలోనైనా కెజి తరగతులు ప్రారంభించాలని కోరారు. అందుకు అవసరమైన ఉపాధ్యాయుల నియామకం కోసం డిఎస్సీని వెంటనే ప్రకటించాలని అన్నారు. వరంగల్ జిల్లాలో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, ఉపాధ్యాయులు కృషితో నడుపబడుతున్న ఇంగ్లీష్ మీడియం పాఠశాలలకు భేషరతుగా ప్రభుత్వం అనుమతి ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో బలహీన వర్గాల పిల్లలు 86 శాతం ఉన్నారని, వీరు తెలుగు మీడియం చదువుతున్నారని, అదే ప్రైవేటు పాఠశాలలో ఉన్నత వర్గాల్లోని పిల్లలు 86 శాతం మంది ఇంగ్లీష్‌మీడియం చదువుతున్నారని ఇది సమసమాజ నిర్మాణానికి ఏ విధంగా తోడ్పడుతుందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రజల విద్యాసంస్కరణల ఉద్యమం జిల్లా కార్యదర్శి బద్దం వెంకట్‌రెడ్డి, ఎడమ శ్రీనివాస్‌రెడ్డి, తోట జ్యోతిరాణి, దామెర ఉపేందర్, వీరాచారి, సదానంద్, వాసుదేవరెడ్డి, రత్నమాల, భాస్కర్, ఆనంద్‌కుమార్, బుచ్చిరెడ్డి, సోమ శేఖర్, వెంకట్‌రెడ్డి, రంజిత్‌కుమార్, తిరుపతి, శ్రీ్ధర్ తదితరులు పాల్గొన్నారు.

బంగారం కోసం భక్తుల ఆరాటం
ఏటూరునాగారం, ఫిబ్రవరి 14: అడవితల్లుల దర్‌నానికి విచ్చేసే భక్తులకు ప్రసాదం (బెల్లం) అందని ద్రాక్షగా మారుతోందని భక్తులు ఆరోపిస్తున్నారు. వనదేవతల దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించే భక్తులకు గద్దెలవద్ద అమ్మవార్ల ప్రసాదమైన బంగారం (బెల్లం) అందించడంలేదు. దీంతో భక్తులు తీవ్ర నిరాశకు గరౌవుతున్నారు. గద్దెల వద్ద బెల్లం గుట్టల్లా ఉన్నా కాంట్రాక్టు పొందిన గుత్తేదారు బెల్లం పోగుచేసేందుకు ఏర్పాటుచేసిన మనుషులు భక్తులకు బ్రతిమలాడినా ప్రసాదం(బెల్లం) దొరకనీయడం లేదని, తల్లుల ప్రసాదం కావాలంటే అక్కడున్నవారిని ప్రాధేయపడాల్సి వస్తోందని భక్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు భక్తులకు తల్లుల ప్రసాదమైన బంగారాన్ని భక్తులకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

డిజిపి అనురాగ్‌శర్మకు ఘన స్వాగతం
బాలసముద్రం, ఫిబ్రవరి 14: మేడారం జాతర బందోబస్తు పర్యవేక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర డిజిపి అనురాగశర్మ ఆదివారం హైదరాబాద్ నుండి మేడారం బయలుదేరారు. డిజిపి వెంట అదనపు డిజిపిలు రాజీవ్ త్రివేది, సుధీప్ లక్టాకియా, ఉత్తర తెలంగాణ ఐజి నవీన్‌చంద్ కూడా ఉన్నారు. మార్గమధ్యంలోని హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్‌లో కొద్దిసేపు దిగిన డిజిపి, అదనపు డిజిపిలను వరంగల్ పోలీసు కమిషనర్ జి.సుధీర్‌బాబుతో పాటు వరంగల్ రేంజ్ డిఐజి మల్లారెడ్డి, రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా, కరీంనగర్ ఎస్పీ జోయల్ డేవిస్‌తో పాటు కమిషనరేట్ పోలీసు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కమిషనరేట్ పరిధిలో జాతర సందర్భంగా చేపట్టిన బందోబస్తుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డిజిపికి వివరించడంతో పాటు నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలను కమిషనర్ డిజిపికి వివరించారు. అనంతరం డిజిపి, అదనపు డిజిపితో పాటు వరంగల్ రేంజ్ డిఐజి, రూరల్, కరీంనగర్ ఎస్పీలు కూడా హెలికాప్టర్‌లో తిరిగి మేడారం బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర డిజిపికి స్వాగతం పలికిన వారిలో అదనపు డిసిపి యాదయ్య, వరంగల్, హన్మకొండ, కాజిపేట, మామునూరు, క్రైమ్, ట్రాఫిక్, స్పెషల్ బ్రాంచ్, ఏఆర్ ఏసిపిలు సురేంద్రనాధ్, శోభన్‌కుమార్, జనార్దన్, మహేందర్, ఈశ్వర్‌రావు, వెంకటేశ్వర్‌రావు, రవిందర్‌రావు, రమేష్, ఇన్‌స్పెక్టర్లు నరేందర్, ఏఎస్ అలీ, వెంకటేశ్వరబాబు, ఆర్‌ఐ నాగయ్య ఉన్నారు.

కార్యకర్తలను కంటికిరెప్పలా
కాపాడుకుంటా
గోవిందరావుపేట, ఫిబ్రవరి 14: తెలంగాణా రాష్ట్ర సమితి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని గిరిజన, పర్యాటకశాఖ మంత్రి అజ్మీర చందూలాల్ అన్నారు. మండల కేంద్రానికి చెందిన టిఆర్‌ఎస్ పార్టీ సినియర్ నాయకుడు మిక్కిలినేని శ్రీహరి మృతిచెందగా ఆదివారం ఆయన కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. ఈసందర్భంగా శ్రీహరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో శ్రమకోర్చి సాధించుకున్న తెలంగాణా రాష్ట్రంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తమ ప్రభుత్వం చిత్తశుద్దితోపనిచేస్తుందని అన్నారు. శ్రీహరి కుటుంబానికి రెండుపడకల గదుల ఇట్టు ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి వెంట పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ అజ్మీర ప్రహ్లాద్, జడ్‌పి ఫ్లోర్ లీడర్ సకినాల శోభన్, ఎంపిపి జెట్టి సుజాత, మండల పార్టీ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మండల నాయకులు తలసిల ప్రసాద్, యగంద్రాచారి తదితరులు పాల్గొన్నారు.