రాష్ట్రీయం

బడ్జెట్ 1.4 లక్షల కోట్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఈ ఆర్థిక సంవత్సరానికి రూపొందిస్తున్న బడ్జెట్ ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. మార్చి మొదటివారంలో శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో, ఈలోగా ప్రతిపాదనలను సిద్ధం చేసి సిఎం ఆమోదానికి ముసాయిదా సిద్ధం చేయడంలో ఆర్థికశాఖ నిమగ్నమైంది. గత బడ్జెట్ కంటే ఈసారి దాదాపు 20 నుంచి 25 వేల కోట్లు అధికంగా ఉండే అవకాశం ఉండొచ్చని ఆర్థికశాఖ అంచనా. గత ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూ.1,15,689.2 కోట్ల అంచనాతో రూపొందించగా, అది ఈ ఏడాది రూ.1,40,000 కోట్లకు కాస్త అటుఇటుగా ఉండబోతుందని అధికారులు అంటున్నారు. అంటే గత బడ్జెట్‌కంటే ఈసారి బడ్జెట్ ప్రతిపాదన రూ.20 నుంచి 25 వేల కోట్ల వరకూ పెరిగే అవకాశం ఉంటుందని అంచనా. గత బడ్జెట్‌లో ప్రణాళికేతవ్యయం రూ.63,306 కోట్లు ఉండగా, ప్రణాళిక వ్యయం రూ.55,000 కోట్లు ఉంది. ఈసారి రూపొందించే బడ్జెట్ అంచనాలో ప్రణాళికా వ్యయం రూ.70 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత ఏడాదికంటే రాష్ట్ర ఆదాయంలో 15శాతం వృద్ధి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. పెరిగిన ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళిక వ్యయాన్ని పెంచి ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రణాళిక వ్యయం రూ.70 వేల కోట్లు ఉంటే అందులో 40శాతాన్ని నీటిపారుదల రంగానికే కేటాయించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ఏడాది బడ్జెట్‌లో నీటిపారుదల రంగానికి రూ. 25వేల కోట్లు కేటాయించబోతున్నట్టు ఇప్పటికే సిఎం కె చంద్రశేఖర్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రణాళిక వ్యయంలో నీటిపారుదల రంగానికి కేటాయించగా, మిగిలే 40నుంచి 45 వేల కోట్లలోనే మిగతా రంగాలకు కేటాయింపులు జరిగేలా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి అవసరమయ్యే బడ్జెట్ ప్రతిపాదనలపై క్షేత్రస్థాయి నుంచి అందుతున్న నివేదికలను క్రోడికరించే పనిలో ఆర్థికశాఖ నిమగ్నమైంది. ఈ ఆర్థిక బడ్జెట్ ఎలా ఉండాలన్న దానిపై సిఎం కె చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ఆర్థికశాఖకు కొన్ని సూచనలు చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై రాజీపడకుండా ప్రణాళిక వ్యయానికి అధిక నిధులు కేటాయించి, ప్రణాళికేతర వ్యయానికి భారీ కోత పెట్టాల్సిందిగా సూచించారు. సిఎం సూచనలను అనసరించి ఆర్థికశాఖ రూపొందిస్తున్న బడ్జెట్ రూ.లక్ష 40 వేల కోట్లకు అటుఇటుగా ఉండే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సంక్షేమ కార్యక్రమాలకు అధిక నిధులు కేటాయించి, మూస పద్ధతిలో కొన్ని శాఖలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించి వాటిని ఖర్చు పెట్టకుండా వదిలేసే విధానానికి ఈసారి స్వస్తిపలకనున్నట్టు అధికార వర్గాల సమాచారం.