బిజినెస్

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 15: వరుస నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలను అందుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 568 పాయింట్లు పుంజుకోగా, గడచిన ఏడాదికిపైగా కాలంలో ఒక్కరోజులో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) సుదీర్ఘకాలం అనంతరం కీలక వడ్డీరేట్లను పావుశాతం తగ్గించిన నేపథ్యంలో గత ఏడాది జనవరి 15న సెనె్సక్స్ 728.73 పాయింట్లు పెరిగింది. మళ్లీ ఆ తర్వాత ఇప్పుడే ఆ స్థాయిలో సెనె్సక్స్ బలపడింది. ఇకపోతే కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక (2014 మే) సెనె్సక్స్ ఒక్కరోజులో భారీగా లాభపడటం ఇది రెండోసారి. మరోవైపు తాజా లాభంతో సెనె్సక్స్ మళ్లీ 23వేల స్థాయిని అధిగమించగలిగింది. ఆసియా, ఐరోపా స్టాక్ మార్కెట్ల లాభాల మధ్య మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ బలపడటం కూడా మార్కెట్ వృద్ధికి దోహదం చేసింది. ముఖ్యంగా దేశీయ సంస్థాగత మదుపరులు (డిఐఐ) దాదాపు 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టారు. అయితే విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) మాత్రం తమ పెట్టుబడులను ఉపసంహరించుకునే పనిలోనే నిమగ్నమయ్యారు. సోమవారం ట్రేడింగ్‌లో సైతం 1,300 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మేశారు. అయినప్పటికీ దేశీయ మదుపరుల అండతో సెనె్సక్స్ 568 పాయింట్లు కోలుకుని 23,554.12 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 182 పాయింట్లు అందిపుచ్చుకుని 7,100 స్థాయికి ఎగువన 7,162.95 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో సెనె్సక్స్ 23,622.64 పాయింట్లను, నిఫ్టీ 7,182.80 పాయింట్లను తాకాయి. బిఎస్‌ఇ మిడ్-క్యాప్ 3.47 శాతం, స్మాల్-క్యాప్ 3.35 శాతం చొప్పున పెరిగాయి. కాగా, మొండి బకాయిల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాలు ఆవిరైపోయిన నేపథ్యంలో గత వారం ట్రేడింగ్‌లో బ్యాంకింగ్ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురైనది తెలిసిందే. అయితే బ్యాంకింగ్ రంగంలో మరిన్ని సంస్కరణలు తెస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం స్పష్టం చేసిన క్రమంలో సోమవారం బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ షేర్ల విలువ 7.94 శాతం పుంజుకోవడమే ఇందుకు నిదర్శనం. ఎస్‌బిఐ షేర్ విలువ ఈ ఒక్కరోజే 167.25 రూపాయలు పెరగడం గమనార్హం. ఈ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారీ నష్టాలపాలైన బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్ విలువ కూడా 22 శాతం పుంజుకుంది. ఇకపోతే ఇటీవల ఆందోళనకు గురిచేస్తున్న ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనం భయాలు కాస్త సడలడం, అంతర్జాతీయ మార్కెట్‌లో అదేపనిగా పతనమవుతున్న ముడి చమురు ధరలు మళ్లీ పుంజుకోవడం మదుపరులను కొనుగోళ్ల వైపునకు నడిపించాయని నిపుణులు చెబుతున్నారు. అయితే గత శుక్రవారం మార్కెట్లు ముగిశాక విడుదలైన పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి), వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు నిరాశాజనకంగా నమోదైనది తెలిసిందే. అయినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు దేశీయ ఆర్థిక గణాంకాల ప్రభావం మదుపరులపై పడకుండా చేశాయని పలువురు మార్కెట్ నిపుణులు విశే్లషిస్తున్నారు. ఆసియా మార్కెట్లలో జపాన్ సూచీ గరిష్ఠంగా 7.16 శాతం పెరగగా, చైనా, తైవాన్, దక్షిణ కొరియా, సింగపూర్, హాంకాంగ్ సూచీలు 0.04 శాతం నుంచి 3.27 శాతం ఎగిశాయి. ఐరోపా మార్కెట్లలోనూ ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు 3.5 శాతం మేర పెరిగాయి. దేశీయ మార్కెట్లలో ఆయా రంగాలవారీగా మెటల్, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రీ, ఇంధనం, ఆటో, చమురు, గ్యాస్, బ్యాంకింగ్, విద్యుత్ రంగాల షేర్ల విలువ 8.79 శాతం నుంచి 2.96 శాతం పెరిగింది. గడచిన రెండు వారాల్లో సెనె్సక్స్ సుమారు 1,900 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 600 పాయింట్లు కోల్పోయినది తెలిసిందే. విదేశీ మదుపరులు సైతం 2,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.