క్రీడాభూమి

భారీ స్కోర్లే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: రానున్న ఆసియా కప్, టి-20 ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో భారీ స్కోర్లు సాధించడమే తన లక్ష్యమని భారత ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. ఇప్పటి ఫామ్‌ను కొనసాగించగలననే నమ్మకం తనకు ఉందని పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పాడు. వౌలిక సూత్రాలను వీడకుండా క్రీజ్‌లో నిలదొక్కుకుంటే భారీ స్కోర్లు సాధ్యమేనని అన్నాడు. తాను ఫామ్‌లో ఉండడం జట్టుకు అత్యవసరమని సహచరులంతా అనడం తన బాధ్యతను పెంచుతున్నదని వ్యాఖ్యానించాడు. సాధ్యమైనంత వరకూ ప్రతి బంతికీ పరుగులు చేసేందుకే ప్రయత్నిస్తాన ధావన్ అన్నాడు. టి-20 ఫార్మెట్‌లో నింపాదిగా ఆడేందుకు వీల్లేదని చెప్పాడు.
సీనియర్‌గా ఉండను..
‘నేను చూడడానికి చాలా సీరియస్‌గా ఉన్నట్టు కనిపిస్తాను. నిజానికి నా ప్రవర్తన అందుకు భిన్నంగా ఉంటుంది. నవ్వుతూ, పక్కవారిని నవ్విస్తూ ఉంటాను. ఇది భగవంతుడు నాకు ఇచ్చిన వరం. అందరినీ నవ్వించడం నాకు చాలా ఇష్టం. జయాపజయాలతో సంబంధం లేకుండా డ్రెస్సింగ్ రూమ్‌లో ఎప్పుడూ సరదాగానే ఉంటాను’ అన్నాడు ధావన్. శ్రీలంకతో జరిగిన టి-20 సిరీస్‌ను గెల్చుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నాడు. ఆసియా చాంపియన్‌షిప్, టి-20 ప్రపంచ కప్ టోర్నీల్లోనూ ఇదే స్థాయిలో రాణిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.