రాష్ట్రీయం

భగీరథ పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: ఈ ఏడాది చివరినాటికి చాలా గ్రామాలకు మంచినీళ్లు అందించేలా కార్యాచరణ రూపొందించుకుని, భగీరథ పనుల్ని పరిగెత్తించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కోలతో సమన్వయం కుదుర్చుకుని పంప్‌హౌజ్, పైప్‌లైన్లు తదితర ఎలక్ట్రో మెకానికల్ ఇంజనీరింగ్ పనులు పూర్తి చేయాలని సూచించారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై శుక్రవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాదీరాజ్‌శాఖ కార్యదర్శి ఎస్‌పి సింగ్, ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డి, సిఎం అదనపు కార్యదర్శి స్మితా సభర్వాల్, వ్యాప్కోస్ సంస్థ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖ అధికారులు కనీసం నెలలో పది రోజులపాటు మిషన్ భగీరథ పనుల్లో భాగం పంచుకోవాలని ఆదేశించారు. వాటర్ ట్రీట్‌మెంట్లు పూర్తి అయిన ప్రాంతాలకు వెంటనే మంచినీరు అందించేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ఏప్రిల్ చివరినాటికి తొమ్మిది నియోజకవర్గాలకు మంచినీటిని అందించే పనుల పట్ల సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే 2016 చివరి నాటికి ఎక్కడెక్కడ ఏయే పనులు పూర్తి చేయగలుగుతారో కార్యాచరణ రూపొందించుకుని అధికారులు, ఇంజనీర్లు, డెవలప్‌మెంట్ పార్టర్నర్స్ (కాంట్రాక్టర్లు) సమన్వయంతో పని చేయాలన్నారు.