బిజినెస్

భారత్ జిడిపి 7.3 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: ఈ ఏడాది భారత జిడిపి వృద్ధిరేటు 7.3 శాతంగా ఉండొచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. వచ్చే ఏడాది ఇది 7.5 శాతానిక పెరుగుతుందని పేర్కొంది. శుక్రవారం ఐక్యరాజ్య సమితి వెల్లడించిన ప్రపంచ ఆర్థిక నివేదికలో ప్రపంచంలో భారత్ జిడిపి వృద్ధిరేటు అన్ని దేశాల కంటే వేగంగా ఉందని చెప్పింది. దక్షిణాసియా దేశాల్లో భారత్ జిడిపి వాటా 70 శాతానికిపైగా ఉన్నది తెలిసిందే.
మే-జూన్‌లో స్పెక్ట్రమ్ వేలం?
న్యూఢిల్లీ, జనవరి 22: ఈ ఏడాది మే-జూన్ నెలల్లో స్పెక్ట్రమ్ వేలం వేసే అవకాశాలున్నట్లు టెలికామ్ కార్యదర్శి రాకేశ్ గార్గ్ శుక్రవారం అన్నారు. ఫిక్కీ-డబ్ల్యుబిఎ విజన్ ఫోరమ్‌లో మాట్లాడిన ఆయన టెలికామ్ సంస్థలు డిమాండ్ చేస్తున్నట్లుగా అందుబాటులో ఉన్న స్పెక్ట్రమ్‌ను వీలైనంత త్వరగా వేలం వేసేందుకు చూస్తున్నట్లు చెప్పారు.