క్రీడాభూమి

భారత్ చేతిలో స్కాట్లాండ్ చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టెల్లెన్‌బాష్ (దక్షిణాఫ్రికా), ఫిబ్రవరి 26: దక్షిణాఫ్రికా పర్యటనలో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత మహిళా హాకీ జట్టు మరోసారి సత్తా చాటుకుంది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ను 5-0 గోల్స్ తేడాతో మట్టికరిపించింది. ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రథమార్థం ముగిసే సమయానికి ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ద్వితీయార్థంలో మరింత కృతనిశ్చయంతో బరిలోకి దిగిన భారత జట్టుకు పెనాల్టీ కార్నర్ల ద్వారా రాణి రెండు గోల్స్ అందించింది. ఆ తర్వాత మూడు నిమిషాలకే దీపిక అద్భుతమైన ఫీల్డ్ గోల్ సాధించగా, 54వ నిమిషంలో అనురాధా దేవి తొక్చోమ్, చివర్లో గుర్జీత్ కౌర్ చెరో గోల్ సాధించి పెట్టారు.