రంగారెడ్డి

బాల్య వివాహాన్ని అడ్డుకున్న తహశీల్దార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోమిన్‌పేట, ఫిబ్రవరి 26: స్థానిక రాయల్ ఫంక్షన్ హాల్లో బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న తహశీల్దార్ విజయకుమారి- సబ్‌కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం అడ్డుకున్నారు. నవాబ్‌పేట మండలం- కుమ్మరిగూడేనికి చెందిన బాలికతో, మోమిన్‌పేట వరునికి వివాహం చేస్తున్నారు. వధూవరుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి వివాహాన్ని ఆపివేసారు. అమ్మాయిని శిశువిహార్‌కు తరలించి చదివించడానికి ఒప్పించామని, అమ్మాయి విద్యార్హత ధ్రువ పత్రాలను 24 గంటల్లో సమర్పించాలని ఆమె ఆదేశించారు. ఇకముందు ఎవరైనా బాల్య వివాహాలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్యవివాహాలు చేసే వారికి జరిమానా, శిక్ష విధించబడుతుందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో సిడిపిఓ వరలక్ష్మి, ఎస్‌ఐ రాజు, ఆర్‌ఐ, విఆర్‌ఓలు పాల్గొన్నారు.