రాష్ట్రీయం

భారీ వంతెనలు కడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: రాష్ట్రంలో వంతెనలు, టనె్నళ్ల నిర్మాణాలను 11 అంచెలుగా చేపట్టి 25 నెలల్లో పూర్తిచేస్తామని చైనా కంపెనీ ప్రతినిధులు ముందుకొచ్చారు. వారు శుక్రవారంనాడు ముఖ్యమంత్రి కెసిఆర్‌తో భేటీ అయ్యారు. తక్కువ వ్యయంతో, తక్కువ సమయంలో వీటిని పూర్తి చేసే వ్యూహాన్ని రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం చైనాకు చెందిన ఆన్టు ఇన్ఫ్రాటెక్ వైస్ ప్రెసిడెంట్ హొస్పేన్ ఖాజీ, డైరెక్టర్ యోగేష్ వా, ఇండియా హెడ్ మనోజ్ గాంధీ, పిఆర్‌ఓ స్వాతిశ్రీ తదితరులు ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. ఈ కంపెనీకి చెందిన ప్రతినిధులు హైదరాబాద్‌లో మూసీ నదిపై బ్రిడ్జి రోడ్డు, దుర్గం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జి, ప్రాణహిత ప్రాజెక్టు టనె్నళ్లు, పంపు హౌజుల నిర్మాణ కాంట్రాక్టులు చేపట్టడానికి ముందుకు వచ్చారు.
వీటికి సంబంధించిన నమూనాలతో వచ్చి మళ్లీ కలుస్తామని గతంలో ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఈ కంపెనీ ప్రతినిధులు శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసి తాము రూపొందించిన నమూనాలను అందజేశారు. దుర్గం చెరువుపై నాలుగు లైన్ల రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన నమూనాలను ముఖ్యమంత్రికి వారు అందజేశారు. వీటిలో మెడిటేషన్ మోడల్, క్యాండిల్ ఫ్లవర్ మోడల్, ట్రీ లీవ్స్ మోడల్, లోటప్ ఆకారాలతో వివిధ రకాల డిజైన్లను వారు రూపొందించారు. అలాగే మూసీ నదిపై 41 కిలో మీటర్ల పొడవున ఈస్ట్-వెస్ట్ కారిడార్ నిర్మిస్తామని వారు వెల్లడించారు. ఇందులో 25 కిలోమీటర్ల మేర స్కైవే, 15 కిలో మీటర్ల మేర రోడ్ వే ఉంటుందని వెల్లడించారు. ఈ నిర్మాణాన్ని 40 నెలలలో పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. దీని కోసం 2500 మంది సిబ్బంది అవసరం అవుతారని, వీరిలో స్థానికులకే ఎక్కువగా అవకాశం కల్పిస్తామని వారు వివరించారు. ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించిన టనె్నళ్లు, పంపుహౌజు డిజైన్లను వచ్చే 20 తేదీకల్లా అందజేయనున్నట్టు వారు ముఖ్యమంత్రికి తెలిపారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రాజెక్టులు, రహదారులు, వంతెనలు, చాలా వేగంగా నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని, వీటికి సంబంధించిన వ్యూహాలను కూడా త్వరగా తయారు చేసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం సమర్పించిన డిజైన్లపై త్వరలోనే నిర్ణయం తీసుకుని పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు.