ఐడియా

రాత్రిపూట బ్రష్ చేస్తే లాభాలెన్నో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాత్రి పడుకోబోయే ముందు బ్రష్ చేస్తున్నారా? చేయకపోతే రోగాల పాలవుతారని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. శారీరకంగా ఎన్నో పరిణామాలు సంభవించినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు. పంటికి, ఒంటికి సంబంధం ఏమిటి అని అనుకుంటున్నారా? ఈ రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉందంటున్నారు. పగలంతా ఏదో ఒకటి తినటం వల్ల నోట్లో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఈ లాలాజలం యాంటీ బాక్టీరియల్‌గా పనిచేస్తూ పళ్లను పదిలంగా కాపాడుతుంది. రాత్రిపూట నోటికి పని చెప్పరు. ఎలాంటి ఆహారాన్ని తీసుకోరు. దీంతో లాలాజలం ఉత్పత్తికాదు. ఫలితంగా బాక్టీరియా నోట్లో ఇరుక్కుపోయిన ఆహార పదార్థాలపై దాడి చేస్తుంది. అంతేకాదు పంటి ఎనామిల్‌ను దెబ్బతీసే ఆమ్లాలను సైతం ఈ బాక్టీరియా ఉత్పత్తి చేస్తాయి. ఈ ఆమ్లాలు నోట్లో బాక్టీరియా వృద్ధి చెందడానికి దోహదం చేస్తుంది. అంతేకాదు పళ్లపై గార ఏర్పడుతుంది. రోగనిరోధక వ్యవస్థ మీద దాడి చేయటం వల్ల అనారోగ్యానికి కారణమవుతుంది. ఈ గార, దంతాలు చుట్టూ ఉండే ఆరోగ్యకరమైన కణజాలంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఫలితంగా ఫ్లూ, వాపు సంభవిస్తే వాటి వల్ల దుష్ఫలితాలు సంభవించకుండా కాపాడే యాంటీబాడీస్‌పై ఈ గార ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి ఉదయం వేళ బ్రష్ చేయటంతో పాటు మధ్యలో తీసుకునే స్నాక్స్ వల్ల ఉత్పత్తి ఆయ్యే బాక్టీరియా నుంచి దంతాలను కాపాడుకోవాలంటే రాత్రి వేళ పడుకోబోయే ముందు బ్రష్ చేసుకోవటం మంచిది. అలాగే ప్లాసింగ్ చేయించినా ఫరవాలేదు. దంతాలపై పేరుకుపోయిన పాచితో పాటు పళ్ల అంచుల చుట్టూ ఆహార రేణువులను ఇది తొలగిస్తుంది. దంతాలకే కాదు మొత్త రోగ నిరోధక వ్యవస్థపైనే తీవ్ర ప్రభావం చూపే పలకాన్ని తొలగిస్తుంది. ప్రకాశవంతమైన చిరునవ్వు మీ ముఖంలో ఎల్లప్పుడూ ఉండాలంటే రాత్రిపూట పడుకునే ముందు బ్రష్ చేయటం ఎంతో ఉత్తమం.