అబ్బాయి వేడుకకు బాబాయ్ గెస్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం షూటింగ్ స్పెయిన్‌లో పూర్తిచేసుకుంది. మిగతా షూటింగ్‌ని హైదరాబాద్‌లో జరపనున్నారు. భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలోని పాటలను ఈనెల 25న క్రిస్మస్ కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా బాబాయ్ నందమూరి బాలకృష్ణ పాల్గొంటాడని సమాచారం. ఇటీవలే ఆయనను వేడుకకు ఆహ్వానించారట. దానికి బాలకృష్ణ కూడా పాజిటివ్‌గానే స్పందించారని తెలిసింది. మరి బాబాయ్-అబ్బాయ్ ఒకే వేదికపై కలిశారంటే అది నందమూరి అభిమానులకు పెద్ద పండగే కదా. త్వరలోనే అధికారికంగా వివరాలు వెల్లడి కానున్నాయి. ఈ చిత్రాన్ని జనవరి 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.