కృష్ణ

చైనా కమ్యూనిస్టు పార్టీ మాకు స్ఫూర్తిప్రదాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* టిడిపి ఆవిర్భావం నాటి నుంచి సౌహార్ధ్ర సంబంధాలు: చంద్రబాబు
* భవిష్యత్‌లో కమ్యూనిస్టు పార్టీతో చేయి కలపండి: ఛెన్ పెంగ్జియాంగ్
* రాష్ట్రం, దేశంలోని రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చలు
* బిజెపి గురించి ఆరాతీసిన చైనా బృందం
విజయవాడ, నవంబర్ 23: రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రత్వం వుండదని పెద్దలు చెబుతుంటారు. అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్‌లో కమ్యూనిస్టు పార్టీలతో చేయిచేయి కలిపి నడిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజధాని నిర్మాణానికి అన్నివిధాలా సహకరించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైనా ప్రభుత్వాన్ని కోరుతుండగా, ముందుగా కమ్యూనిస్టులతో కలిసి ప్రయాణం చేయాలంటూ దాదాపు వారు షరతు విధిస్తున్నట్లు తెలుస్తోంది. రాజధాని ప్రాంతంలో రెండురోజుల పర్యటనకు చైనా దేశ ఉప మంత్రి, ప్రముఖ కమ్యూనిస్టు నేత ఛెన్ పెంగ్జియాంగ్ సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నగరానికి చేరుకున్నారు. ఈసందర్భంగా చైనా బృందానికి రాచమర్యాదలతో ఘన స్వాగతం లభించింది. ఒక స్టార్ హోటల్‌లో విశ్రాంతి తీసుకున్న అనంతరం చైనా ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈసందర్భంగా రాష్ట్ర, దేశ రాజకీయ పరిస్థితులపై కీలకమైన చర్చలు జరిగాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చైనా ప్రభుత్వాన్ని ఆకట్టుకునేలా వ్యవహరించారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి కూడా తమకు సౌహార్ధ్ర సంబంధలున్నాయని అన్నారు. తన మామ దివంగత ఎన్టీఆర్ చారిత్రక అవసరంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారని, అదే పార్టీకి తాను గత రెండు దశాబ్దాలుగా అధ్యక్షునిగా కొనసాగుతున్నానని చెప్పారు. గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి పదేళ్లపాటు ప్రతిపక్షంలో వుండి మళ్లీ 19 మాసాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నానంటూ చంద్రబాబు వారికి వివరించారు. రాష్ట్రంలో బిజెపి, కేంద్రంలో తెలుగుదేశం మంత్రివర్గంలో భాగస్వామ్యం వహిస్తున్నాయని తెలిపారు. ఏ పార్టీ నుంచి ఎంతమంది ఏఏ శాఖలు నిర్వహిస్తున్నది కూడా చంద్రబాబు వివరించారు. బిజెపి, తెలుగుదేశం పార్టీల మధ్య కుదిరిన అవగాహన అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. పార్టీలను నడపటంలో రెండు పార్టీల మధ్య వున్న తేడాను చైనా బృందం ప్రశ్నించగా బాబు సమాధానమిస్తూ తమ రెండు పార్టీలు పోటాపోటీగా ప్రస్తుతం వున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కేవలం 50రోజుల్లో 54లక్షల మందిని సభ్యులుగా చేర్చుకుందని, గ్రామాల్లో సభ్యత్వ నమోదుకు కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించామన్నారు. సభ్యత్వం కింద 100 రూపాయలు వసూలు చేసిన కార్యకర్తలకు రెండేళ్లపాటు బీమా సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ప్రతి రెండేళ్లకు తమ పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. ఇక బిజపికి దేశమంతా 10కోట్ల మంది సభ్యులున్నారని తెలిపారు. నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ కాగా ప్రస్తుతం జాతీయ పార్టీగా అవతరించిందన్నారు. దేశంలో అత్యుత్తమ క్రమశిక్షణ కలిగిన ఆర్గనైజ్డ్ పార్టీ తెలుగుదేశం ఒక్కటేనని చంద్రబాబు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడటానికి, రాష్ట్భ్రావృద్ధికి తమ పార్టీ మొదటి నుంచి పోరాడుతూ జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తూ వస్తోందన్నారు. కేంద్రంలో టిడిపి మద్దతుతోనే పలుమార్లు కాంగ్రెస్ వ్యతిరేక ప్రభుత్వాలు ఏర్పడ్డాయన్నారు. తెలుగుదేశం ఎంతో బలమైనదని, ప్రగతిశీల భావాలతో పనిచేస్తుందని, సంస్కరణలకు, సమ్మిళిత వృద్ధికి కట్టుబడి వుందని వివరించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ తమకు గొప్ప స్ఫూర్తిప్రదాతగా చంద్రబాబు అభివర్ణించారు. చైనాలో పార్టీయే ప్రభుత్వంలా వ్యవహరిస్తుందని, అయితే భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో తాము ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రజల తీర్పు కోసం ఎన్నికలకు వెళతామన్నారు. ప్రజలకు సేవ చేయటం కోసమే రాజకీయాలు ఉండాలనేది తన అభిమతంగా చెప్పారు. అందుకే తాను కష్టపడి పనిచేస్తున్నానన్నారు. ప్రజలకు మరింత సమర్ధంగా సేవ చేయడానికి చైనా నుంచి మరికొన్ని అనుభవాలు నేర్చుకోదలిచానని, భవిష్యత్‌లో రెండు పార్టీల మధ్య నిరంతర సంబంధాలు, సంప్రదింపులు వుంటే ఒకరి అనుభవాలు మరొకరు పంచుకోవచ్చని చైనా బృందానికి చంద్రబాబు వివరించారు.

కృష్ణామిల్క్ యూనియన్‌తోనే కల్తీలేని పాలు
తోట్లవల్లూరు, నవంబర్ 23: కృష్ణాజిల్లాలో కల్తీలేని నాణ్యమైన పాలు(విజయ) బ్రాండ్‌తో అత్యధిక పాలు సరఫరాచేసే ఘనత కృష్ణామిల్క్ యూనియన్‌దేనని కృష్ణామిల్క్ యూనియన్ మేనేజింగ్ డైరెక్టర్ బాబురావు అన్నారు. వల్లూరుపాలెం పాలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు నేడు ఎటు చూసినా కల్తీపాల వార్తలు వినియోగదారులను ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితులలో తమ యూనియన్ పాలను ల్యాబ్‌ల్లో పరీక్షలు చేయించగా స్వచ్చమైన పాలుగా గుర్తింపునిచ్చారని వివరించారు. ఏడాదికి 1.50 వేల లీటర్ల పాలు సేకరిస్తుండగా ఇతర ప్రాంతాల నుంచి సేకరించి 2.60 లక్షల లీటర్ల పాల వ్యాపారం చేస్తు కృష్ణామిల్క్ యూనియన్ రూ.520 కోట్ల టర్నోవర్‌తో రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో ఉందన్నారు. పాడి పోషణ రైతుల ప్రయోజనాల కోసం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శిబిరాలలో 75 నుంచి 100 వరకు ఉచిత మెగా వైద్య శిబిరాలు, 400లకు పైగా మిని వైద్యశిబిరాలను నిర్వహిస్తున్నామని వివరించారు. అలాగే 90 కోట్లతో అనేక రకాల మిల్క్ ప్రొడక్ట్స్ తయారుచేసి వినియోగదారులకు అందజేస్తున్నామని తెలిపారు. కృష్ణామిల్క్ యూనియన్ చైర్మన్ జానకిరాయమ్య ఆధ్వర్యంలో 2009 నుంచి అభివృద్ది పథంలో నడుస్తుందని అన్నారు. విజయవాడ రాజధాని అయిన దృష్ట్యా పాల సరఫరా పెరిగే అవకాశం ఉందని, అందువల్ల అవసరమైతే చిత్తూరు, నెల్లూరు, తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా పాలు సేకరించి తీసుకుంటున్నామని తెలిపారు.