ఆంధ్రప్రదేశ్‌

రాజధాని నిర్మాణం జరగకపోతే తీవ్రంగా నష్టపోతాం:చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం జరుగకపోతే తీవ్రంగా నష్టపోతామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ‘రాష్ట్ర రాజధాని అమరావతిపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రౌండ్ టేబుల్ సమావేశానికి 17 పార్టీలు, వివిధ సంఘాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో నిర్మాణ కార్యక్రమాలు జరగటం లేదని, గతంలో నిర్మాణ పనులు జరిగినపుడు రోజుకు 50 వేల మంది కార్మికులు పనిచేసేవారని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగాలంటే సంపద సృష్టించుకోవాలని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగిందని ప్రభుత్వం భావిస్తే విచారణ జరపాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే రాజధానిపై సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని అన్నారు.