రాష్ట్రీయం

కాపులకో కార్పొరేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ.100 కోట్లతో ప్రత్యేక నిధి
బీసీ రిజర్వేషన్లపై రిటైర్డ్ జడ్జితో కమిషన్
ఓడరేవుల క్రమబద్ధీకరణకు మారిటైం బోర్డు
నేటినుంచి 14 వరకు జనచైతన్య యాత్రలు
కరవురహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు

విజయవాడ, నవంబర్ 30: గత ఎన్నికల ప్రచారంలో కాపు కులస్తులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా వారి ఆర్థిక స్థితిగతులు అధ్యయనం, మెరుగుదలకు రూ.100 కోట్లతో కాపు కమిషన్ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. కాపులకు బీసీ రిజర్వేషన్‌ను వర్తింపచేసే అధ్యయనానికి హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేయాలని సోమవారం సిఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయించింది. బీసీ వర్గాలకు ప్రస్తుతం అమల్లోవున్న రిజర్వేషన్లకు ఎలాంటి ఆటంకం లేకుండానే కమిషన్ సిఫార్స్ చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కూడా సమావేశం నిర్ణయించింది. కొత్తగా ఏర్పాటు చేయబోయే కార్పొరేషన్ పేదలకు ఆర్థిక చేయూతను అందించటం ద్వారా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడాలని, అలాగే 9మాసాల్లో నివేదిక అందించేలా ఆదేశాలు జారీ చేయాలని, ప్రస్తుతం అమల్లోవున్న బీసీ, ఎస్టీ, ఎస్టీలకు రాజ్యాంగపరంగా సంక్రమించిన రిజర్వేషన్లను తగ్గించటంకాని, మార్పుచేయటంకాని లేకుండా సిఫార్సులకు మాత్రమే కమిషన్‌ను పరిమితం చేయాలని సమావేశం నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ సమావేశం అనంతరం వివరాలను మంత్రులు యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాథరెడ్డి, కె నారాయణ మీడియాకు వివరించారు. బీసీలకు ఆర్థిక చేయూత అందించేందుకు తొలిసారిగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బిసి సబ్‌ప్లాన్‌కు రూ.6640 కోట్లు కేటాయించామని, చంద్రన్న ఆదరణ కార్యక్రమం ద్వారా చేతివృత్తులను ప్రోత్సహించేందుకు ఆర్థిక సాయం అందిస్తామని మంత్రులు తెలిపారు. పేదలకు ఆర్థిక సహకారం అందించే లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. కులాలవారీగా ఏర్పాటైన అన్ని సమాఖ్యలపై సమీక్ష జరుపుతామన్నారు.
ప్రస్తుత ఓడరేవులను అభివృద్ధి చేయటంతోపాటు వాటి కార్యకలాపాలను విస్తృతపర్చి కొత్తవాటి ఏర్పాటుకు మారిటైం బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు మంత్రులు వెల్లడించారు. ఓడరేవుల్లో వౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర తరహాలో కొత్తగా మారిటైం బోర్డు ఏర్పాటు చేయనున్నారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం పల్లమల గ్రామంలో 400/200 కెవి సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఎకరాకు రూ.4 లక్షల 26వేలు చొప్పున చెల్లించి 13 ఎకరాల భూమి సమీకరించాలని సమావేశం నిర్ణయించింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కామకూరు గ్రామంలో రవీంద్ర కంపెనీ రహదారి నిర్మాణానికి ఎకరాకు రూ.50 లక్షల చొప్పున 0.09 సెంట్ల భూమిని, వెంకటాచలం మండలంలో క్రిబ్‌కో ఫెర్టిలైజర్ యూనిట్ ఏర్పాటుకు ఎపిఐడిసికి 5.08 ఎకరాలు కేటాయించేందుకు, కడపలో ఇసిహెచ్ పాలీక్లినిక్ నిర్మాణానికి సెంటు రూ.96,800 వంతున 14 సెంట్ల కేటాయింపునకు సమావేశం నిర్ణయం తీసుకుంది. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వచ్చిన వరద నష్టాలను తక్షణం అంచనా వేయాలని, పునరావాస చర్యలను చేపట్టాలని నిర్ణయించారు.
డిసెంబర్ 1నుంచి 14 వరకు జనచైతన్య యాత్రలు నిర్వహించాలని, కార్యక్రమంలో గ్రామ, మండల జన్మభూమి కమిటీలు, శాసనసభ్యులు పాల్గొని ప్రజల సమస్యలు, విజ్ఞాపనలు తెలుసుకుని ప్రభుత్వానికి నివేదించేలా చూడాలని సమావేశం నిర్ణయించింది. జనవరి 1నుంచి జరిగే జన్మభూమి కార్యక్రమానికి ముందే ‘మీ కోసం’, ‘మీ ఇంటికి మీ భూమి’ పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని మంత్రివర్గం ఆదేశించింది.
కరవురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు భూగర్భ జలాల స్థాయి పెంచేలా వ్యవసాయ, నీటిపారుదల శాఖలు జాతీయ ఉపాధి హామీ పథకం సమన్వయంతో 10 హెక్టార్లలో ఫామ్ ఫండ్‌లను నిర్దేశించిన కాలానికి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం ఆదేశించింది.
నెల్లూరు, కర్నూలు, అనంతపురం, రాజమండ్రి, కాకినాడలలో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. విశాఖ నుంచి చెన్నై, బెంగుళూరు నుంచి చెన్నై పారిశ్రామిక హబ్‌ను దృష్టిలో వుంచుకుని అర్బన్ డెవలప్‌మెంట్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించినట్టు విలేఖర్ల సమావేశంలో మంత్రులు వివరించారు. (చిత్రం) విజయవాడలో సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో మాట్లాడుతున్న సిఎం చంద్రబాబు