ఆంధ్రప్రదేశ్‌

ఇది మహా సంకల్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 31: నవ నిర్మాణ దీక్ష జూన్ 2, మహా సంకల్పం జూన్ 8న, వాటిమధ్య ఐదు రోజుల్లో జరిగే అన్ని దీక్షలను విజయవంతం చేయాలని సిఎం చంద్రబాబు కోరారు. బుధవారం తన నివాసం నుంచి టెలికాన్ఫరెన్స్‌లో మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. ప్రతి జిల్లాలో, నియోజకవర్గంలో జరిగే సభలను తాను స్వయంగా పరిశీలిస్తానని, విశే్లషిస్తానని చెప్పారు. ప్రభుత్వ పథకాల్లో తాము పొందిన ఫలితాల గురించి లబ్ధిదారులతో దీక్షా సభల్లో మాట్లాడించాలని, అది ఇతరులకు స్ఫూర్తిదాయకం అవుతుందని సూచించారు. 2014లో ఎక్కడ ఉన్నాం, ఇప్పుడెక్కడ ఉన్నాం, మూడేళ్లలో ఏం చేశాం, ఇంకా ఏం చేయాలి.. అనేదాన్ని ఈ సభల్లో విశే్లషించాలన్నారు. నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలో జరిగే చర్చాగోష్టుల్లో అందరూ పాల్గొనాలన్నారు. రాష్టస్థ్రాయిలో జరిగే సభల్లో ప్రతిరోజూ తాను పాల్గొంటానని తెలిపారు. మూడేళ్ల ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇది మంచి అవకాశమని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజల్లోకి ప్రభుత్వ సందేశాన్ని బలంగా తీసుకెళ్లాలని కోరారు. గత ఏడాది ‘అందరికీ విద్యుత్ (పవర్ ఫర్ ఆల్)’ అనే సంకల్పం సాధించామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలో అన్ని ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. ఈ ఏడాది ‘అందరికీ వంటగ్యాస్’ అనే సంకల్పం నెరవేర్చామన్నారు. కిరోసిన్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చగలగడం గొప్ప విషయమన్నారు. 100 శాతం వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశానికే మార్గదర్శకం అయ్యిందన్నారు. వచ్చే ఏడాది మరో సంకల్పం నెరవేరుస్తామన్నారు. ఏడాదికో సంకల్పాన్ని సాకారం చేస్తున్నామంటూ, 2022 నాటికి 3వ అగ్రగామి రాష్ట్రంగా రూపొందాలన్నారు. 2029 నాటికి దేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కావాలన్నదే మహా సంకల్పమని ఆయన చెప్పారు. 2050 నాటికి ప్రపంచంలో అత్యుత్తమ రాష్ట్రం కావాలన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు మనందరి బాధ్యత అంటూ రాష్ట్ర భవిష్యత్తు మనందరి చేతుల్లో ఉందన్నారు. సంఘీభావం, సమష్టితత్వం, సమన్వయం పెంచేందుకే ప్రతి ఏటా సంకల్ప దీక్షలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఆర్థిక లోటు అధిగమించేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నామని, అయినా విభజన కష్టాలు అధిగమించడం చాలా కఠినతరంగా ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో మనలో స్ఫూర్తిని నింపేందుకే ‘నవ నిర్మాణ దీక్ష’ చేపట్టినట్లు గుర్తుచేశారు. గొప్ప భవిష్యత్తు వైపు మనలను నడిపించేందుకే ‘మహా సంకల్ప దీక్ష’ చేపట్టామన్నారు. జూన్ 3న విభజన చట్టం, హామీల అమలు, మూడేళ్లలో ఏం సాధించాం, ఇంకా ఏమి సాధించాలన్న దానిపై సమీక్ష, 4న వ్యవసాయం - అనుబంధ రంగాలు, జలసంరక్షణ, నీరు-ప్రగతి, నదుల అనుసంధానం, భూగర్భ జలాల పెంపు, పంటకుంటలు, రుణ ఉపశమనం, సుస్థిర అభివృద్ధి వ్యూహం, 5న సంక్షేమం, సమ్మిళిత అభివృద్ధి, 6న మానవ వనరుల అభివృద్ధి, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ కల్పన, 7న ప్రజలే ముందు, సమాజ వికాసం, కుటుంబ వికాసం, పారదర్శక జవాబుదారీ సుపరిపాలన, అవార్డులు, విజయాలపై చర్చాగోష్టులు నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు.