ఆంధ్రప్రదేశ్‌

టిడిపి ఎంపీలతో చంద్రబాబు భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో టిడిపి ఎంపీలతో ఆ పార్టీ అధినేత, ఎపి సిఎం చంద్రబాబు శుక్రవారం ఇక్కడ భేటీ అయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన ఎంపీలతో చర్చిస్తున్నారు. ఈరోజు ఆయన దిల్లీ వెళుతున్నందున ఎంపీలను కలుసుకుని వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. విభజన సమస్యలు, నీటి వివాదాలు, కేంద్రం కేటాయింపులు, రాష్ట్ర పథకాలు, హైకోర్టు విభజన వంటి అంశాలపై చర్చ జరిగితే ఎలా మాట్లాడాలన్న విషయమై చంద్రబాబు ఎంపీలకు సూచనలు చేసినట్టు సమాచారం. తెలంగాణ ఎంపీలు లేవనెత్తే అంశాలను ఎలా ఎదుర్కొనాలన్న విషయం కూడా ఎంపీల భేటీలో చర్చకు వచ్చిందని భోగట్టా.