అంతర్జాతీయం

గ్లాసు నీటిలో 10లక్షల బ్యాక్టీరియా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేలే చేస్తుందన్న అధ్యయనం
లండన్, డిసెంబర్ 28: నిత్యం మనం తాగే ప్రతి గ్లాసు నీటిలో 10 లక్షల బాక్టీరియా ఉంటుందట! కంగారు పడకండి.. ఇదంతా ‘మంచి’ బాక్టీరియానేనని తాజా అధ్యయనం పేర్కొంది. తాగునీటిని శుభ్రపరచడంతోపాటు దానిని సురక్షితంగా ఉంచేందుకు ఈ బ్యాక్టీరియా ఎంతగానో తోడ్పడుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. మనం తాగే నీటిని ఎక్కువ మేరకు శుభ్రపరిచేది నీటి పైపులు, నీటిశుద్ధి ప్లాంట్లలో ఉండే ‘మంచి’ బ్యాక్టీరియాయేనని పరిశోధకులు ఈ అధ్యయనంలో కనుగొన్నారు. ఇప్పటివరకూ ఈ బ్యాక్టీరియా గురించి, దాని ఉనికి గురించి ఎవరికీ తెలియదని వారు పేర్కొన్నారు. ఇతర మైక్రోబ్‌లతో (సూక్ష్మ జీవులతో) కలసి ఈ బ్యాక్టీరియా నీటి పైపుల్లోనూ, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లలోనూ పెరుగుతుందని, బయో ఫిలిమ్‌గా పిలిచే అత్యంత పలుచనైన, జిగురు కోటింగ్ రూపంలో మాత్రమే ఈ బ్యాక్టీరియాను చూడగలుగుతామని వారు తెలిపారు.