అంతర్జాతీయం

ప్లాస్టిక్‌ను తినేసే బ్యాక్టీరియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్యావరణ కాలుష్యానికి చెక్

టోక్యో, మార్చి 12: పర్యావరణ పరమైన ఆందోళనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో సరికొత్త బ్యాక్టీరియాను జపాన్‌కు చెందిన పరిశోధకులు వెలుగులోకి తెచ్చారు. ఈ బ్యాక్టీరియా ప్లాస్టిక్ వస్తువులను తినేస్తుందని, ఆ విధంగా పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుందని వెల్లడించారు. ప్లాస్టిక్ వస్తువుల వల్ల కాలుష్యం పెరిగిపోతోందన్న ఆందోళనకు ఈ బ్యాక్టీరియా చెక్ పెడుతుందని చెబుతున్నారు. అనేక రకాల ప్లాస్టిక్ వస్తువుల ఉత్పత్తిలో పిఇటి అనే ఒక రకమైన పాలిమర్‌ను ఉపయోగిస్తారు. ఎంతగా ఇది భూమీద పేరుకుపోతే అంతగానూ పర్యావరణానికి నష్టం కలుగుతుంది. సీసాలు మొదలుకొని వస్త్రాల వరకు ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పెరిగిపోవడంతో కోటాను కోట్ల టన్నుల మేర ఇవి వ్యర్థాలుగా విసర్జితమవుతున్నాయి. 2013లోనే 56 మిలియన్ టన్నుల మేర ఈ రకమైన పాలీ ఉత్పత్తులు పేరుకుపోయినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు ఈ రకమైన ప్లాస్టిక్ వస్తువులను తినివేసే బ్యాక్టీరియా రావడంతో ఈ సమస్యకు పరిష్కారం చిక్కినట్లేనని చెబుతున్నారు. తాము ప్రయోగాత్మకంగా జరిపిన పరీక్షల్లో భాగంగా ఒక అతి పలుచని పిఇటితో తయారు చేసిన ఫిల్మ్‌ను ఉపయోగించామని, దీనిపై ఈ తాజా బ్యాక్టీరియా తీవ్ర ప్రభావాన్ని చూపించిందని, ఆరు వారాల్లోనే దీని ప్రభావానికి ఆ ఫిల్మ్ పూర్తిగా కరిగిపోయిందని వివరించారు.