భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-82

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరైనా సరే ఉదారంగా బతకటం నేర్చుకోవాలి. ఇవ్వడంలోని ఆనందాన్ని రుచి చూడాలి. ఒకవేళ దాని రుచిచూస్తే చాలు అందరూ ఇవ్వడం నేర్చుకుంటారు. నీవు కూడా కావాల్సిన తీసుకొని మిగతా ఎవరికైనా ఇవ్వు ’ అని చెప్పాడు.
రెండు రోజుల క్రితం డబ్బుకావాలని వచ్చినతను గబగబా బాబా దగ్గరకువచ్చి ‘బాబా మీరు ఆరోజు డబ్బు ఇవ్వనిదే మంచిది అయింది. లేకుంటే నేను కూడా ఆ చీటీలవానికి కట్టేవాణ్ణి. అతను ఇపుడు అందరి దగ్గర కట్టించుకుని పారిపోయాడు. 10 కట్టితే వారంలో 100 ఇస్తానని అన్నాడు. అందరూ కట్టారు. కాని అతడు ఇపుడే ఎక్కడికో వెళ్లిపోయాడు. క్రితంవారం కట్టినవాళ్లు వచ్చారు. ’ అని చెప్పాడు.
‘కూర్చోన్న చోట నుంచి కదలకుండా డబ్బు రావాలంటే ఎక్కడ నుంచివస్తుంది. పని చేస్తే డబ్బులు వస్తాయి. అవి మంచిఫలితాలను ఇస్తాయి. కాని, ఎపుడూ ఊరికినే సొమ్ము తీసుకోవాలని అనుకోకూడదు. ఊరికినే తీసుకొన్నది ఊరికినే పోతుంది ’అన్నారుబాబా. సాయి ఎపుడూ సహాయం చేయాలని అనేవారు. ఒకరోజు సాయి దగ్గరకు రైతు వచ్చాడు. ‘బాబా నేను పొలంలో బావి తవ్వించుకుంటే నీళ్లు పడుతాయన్నారు. ఆనీటితోపొలాన్ని సులభంగా పండించుకోవచ్చు. కాని బావి తవ్వడానికి పైకం అవసరం అవుతుంది. ఆ పైకాన్ని బ్యాంకు వాళ్లను అప్పుగా అడిగితే ఇవ్వరని అంటున్నారు. నీవు ఎలాగైనా ఆ అప్పు ఇప్పించు నేను అప్పులను తీర్చేటట్లు నన్ను అనుగ్రహించు’అన్నారు.
‘అయితే నీవు నానా చందోర్కర్ తో విషయం చెప్పు నేను కూడా చెబుతానులే. అతడు చెప్పి నీ పని జరుగుతుంది ’అన్నారు బాబా.
బాబా చెప్పినట్లే ఆ జిల్లా కలెక్టరు దగ్గరకు నానా వెళ్లి విషయం అంతా వివరించాడు. అది విని కలెక్టరు రైతుకు బావి తవ్వించడానికి డబ్బులు మంజూరు చేశారు. అతడు అనుకొన్నట్లే అంతా జరిగింది. తన పనులన్నీ పూర్తి అయిన తర్వాత వచ్చి ‘బాబా మీరు చెప్పినట్లే అన్నీ జరిగాయి. ’ అని దణ్ణం పెట్టాడు. తాను అనుకొన్న పైకాన్ని బాబాకు ఇచ్చాడు. బాబా దాన్ని తీసుకొని ‘డబ్బు కు రక్షణ చేయడమంటే దానం చేయడమే. కనుక నీవు ఈ డబ్బు ను ఖర్చుచేసి నలుగురి అన్నదానం చేయి నీకు అంతా మేలు జరుగుతుంది’అన్నారు.
బాబా ఎపుడూ ఆసనాల గురించి మాట్లాడేవారు కాదు. ఎపుడు ఆసనాలు వేసేవారో ఎవరికీ తెలిసేది కాదు. నిరంతరమూ తన పని ఏదో అది చేసుకొంటూ వుండేవారు కాని దేనికీ ప్రచారం కావాలని కోరుకునేవారు కారు.
ఒకరోజు శ్రీమతి తార్కాడ్ కుమారుడు బాబా దగ్గరకు వచ్చాడు. అతడు రాగానే బాబా నీవు వెళ్లి జోగ్ దగ్గర దక్షిణ నేను అడిగానని అడిగి తీసుకొని రా అని చెప్పి పంపారు.
అతడు వెళ్లిన కొద్ది సేపట్లోనే తిరిగి వచ్చాడు.
‘బాబా నన్ను ఎందుకు అక్కడికి పంపించారు.అలాంటి చోటికి నాకు వెళ్లాలని అనిపించదు. ఎందుకంటే అక్కడ బాబా నిన్ను దేవుడు కాదని అంటున్నారు. దేవుడు కాదని అనే వారి మాట నాకు వినాలనిపించదు.’అన్నాడు.
‘అసలు వాళ్లు నీకేమని చెప్పారు నా దక్షిణ గురించి అడిగావా లేదా ’అన్నారు.
‘నేను అడగకుండా వచ్చేసాను. వారంతా బాబా దేవుడు కాదు. కేవలం అవధూత, సద్గురువు ’అనే అంటున్నారు.
‘చూడు బాబూ! నిజంగా నేను దేవుడిని కాను. పరమాత్మకు స్వరూపం లేదు. నామం అసలే లేదు. కాని మనం కోరుకున్నట్టు ఆయన మనకు కనిపిస్తారంతే. నీవు నన్ను దేవుడు అనుకొంటున్నావు. అట్లానే వారు సద్గురువు అనుకొంటున్నారు. దానివల్ల మనకు వచ్చిన నష్టం ఏముంది. ఎదుటి వారు ఏమి అనుకొంటే అది అనుకోనివ్వు. కాని నీవు చేయాల్సిన పనిని మాత్రం నీవు చేస్తూ ఉండు.’అన్నారు.
‘అది కాదు బాబా మీరు నాకు దేవుడినే’ అన్నాడు అబ్బాయి.
‘నీవు నన్ను దేవుడు అనుకొంటున్నావు కదా. నేను చెప్పిన పని నీవెందుకు చేయలేదు’అన్నాడు.
‘వాళ్లు నిన్ను దేవుడు అనుకోవడం లేదు కదా. అయినా నీదగ్గర డబ్బు లేదా ఏమిటి వారిని ఎందుకు అడగాలి’ అన్నాడు.
-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743