భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-83

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరమాత్మ అంటే ఒక్క దగ్గర ఉండేవాడు కాదు. సర్వాంతర్యామి. అతడు అన్ని చోట్ల అన్ని వేళలా అన్నింటిలోనూ ఉంటాడు.
భగవంతుడు నీలో నాలో కూడా ఉన్నాడు. ఆ పశువుల్లోను, చీమల్లోను దోమల్లోను కూడా ఉంటాడు. భగవంతుడు లేనిది ఏదీ లేదు.ఇపుడు నన్ను అవధూత అన్నవారు కూడా భగవంతుని స్వరూపాలే. నీవు అన్నింటికీ కారణాకారుడు భగవంతుడు అని అనుకోండి అపుడు అన్నీ నీకే తెలుస్తాయి అన్నాడు.
అతడు బాబా చెప్పింది విని ఆచరించాలనుకొన్నాడు. వెంటనే బాబా కు నమస్కారం చేసి ‘సరే బాబా నేను ఇపుడే వెళ్లి దక్షిణ అడిగి వస్తాను’అన్నాడు.
‘ఇక వద్దులే. కొద్దిసేపట్లో జోగ్ వచ్చేస్తాడు’అన్నాడు బాబా
అన్నట్లుగా జోగ్ వచ్చి బాబాకు దక్షిణ సమర్పించాడు సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించాడు.
బాబా చిరునవ్వు నవ్వాడు. తార్కాడ్ కుమారుడు బాబా ను చూసి ఎంతో సంతోషపడ్డాడు. అతడు మనసులో నాకు మాత్రం బాబానే భగవంతుడు అని నమస్కరించాడు.
‘‘మనోవాంఛా ఫల సిద్ధిరస్తు ’’ అన్నారుబాబా. తార్కాడ్ కుమారుడు ఆశ్చర్యానందాలతో మళ్లీ చేతులెత్తి నమస్కరించాడు.
ఒకరోజు రాత్రి పొద్దుపోయిన తరువాత అప్పాభిల్ అనే అతను బాబా దర్శనం కోసం వచ్చాడు.
అతడు వచ్చేసరికి మసీదులో బాబా శరీర అవయాలు అటు ఇటు పడి ఉన్నాయి. అతడు భయంతో కంపించిపోయాడు. ఎవరో దుండగులు వచ్చి బాబాను నరికి వెళ్లిపోయారు అనుకొన్నాడు. అతడు వెంటనే అక్కడ్నుంచిపారిపోయాడు. ఇంటికి వెళ్లి బాబా నే స్మరిస్తూ పడుకొండిపోయాడు. ఎవరితో నైనా ఈవిషయం చెపితే తనకేదైనా ప్రమాదం రావచ్చు అనుకొని తెల్లారి పోయినా అతడు బయటకు రావడానికి జంకాడు. కాని ఊరిలో ఎలాంటి శబ్దమూ లేదు. ఒకవేళ బాబా చనిపోతే శిరిడీ అంతా గందరగోళంగా వుండేది కదా. కనీసం ఎవరైనా ఈవిషయం గురించి మాట్లాడుకునేవారు కదా. అంతా సాధారణంగా వుందే ఎందుకని అతడు ఆలోచిస్తూ చిన్నగా వీధిలోకి చూశాడు. అక్కడ అంతామామూలుగా వుంది. నెమ్మదిగా బయటకు వచ్చాడు. తిరిగి మనస్సు చిక్కబట్టుకుని బాబా బాగుండాలని కోరుకుంటూ స్నానపానాదులు చేసి బాబా కు మొక్కుకుంటూనే బాబా దగ్గరకు వెళ్లారు.
అప్పాభిల్ ను చూడగానే ‘్భల్ వచ్చేయి ఏం జరగలేదు. అంతా బాగానే ఉంది. నీవు అనవసరంగా భయపడ్డావు. రారా’అని బాబా పిలిచారు. అతడు మరింత ఆశ్చర్యపోతూ బాబా దగ్గరకు వచ్చాడు. అతని శరీరం ముట్టుకొని చూశాడు. బాబా చిరునవ్వుతో ‘నమ్మకమే కదా. నేనే నీ బాబాను’ అన్నారు. అతడు కన్నీళ్లు కారుస్తూ దణ్ణం పెట్టేడు.
బాబా అతనిని తలపైన నెమురుతూ ఏం కాలేదు అప్పాభిల్ అది ఖండయోగ యోగాసనాల్లో అది ఒకటి. నీవు అనుకోకుండా ఇటు వచ్చావు కదా. అంతే మరేమీ లేదు అన్నారు
అట్లా బాబా ఎపుడు ఏ ఆసనాలు వేసేవారో ఎవరికీ అంతు బట్టకపోయేది. అందరూ యోగాభ్యాసకులు ధౌతి చేసేవారు. అంటే ఒక సన్నని వస్త్రాన్ని కడుపులోకి జీర్ణకోశం లోకి పంపి శుభ్రపరుచుకునేవారు. కాని బాబా పేవులనే తీసి కడిగి ఆరబెట్టి మళ్లీ లోపలికి పంపించేవారు. చాలామంది ఈ ధౌతి కార్యక్రమాన్ని చూసేవారు.
ఒకరోజు నానా సాహెబ్ డేంగలే బాబా దగ్గరకు వచ్చాడు. అతడు నాల్గుమూరల పొడవు, జానెడు వెడల్పు గల ఒక చెక్కను బాబాకు ఇచ్చాడు. అతని కోరిక మాత్రం బాబా కు మంచం చేయించాలనుకొనేవాడు. కాని ఆకోరిక తీరలేదు. ఈ చెక్కను అనుకోకుండా సమర్పించాడు. బాబా దాన్ని తీసుకొని నీ మనోరథం పూర్తి అవుతుందిలే అన్నారు.
ఒకసారి కొందరు రాత్రిపూట బాబా దగ్గరకు వచ్చారు. లోపల ఏంజరుగుతోందో బాబాకు తెలియకుండా చూడాలని వారు తొంగి చూస్తూ నక్కి వేచి చూస్తున్నారు.
అపుడు వారు తొంగి చూసేసరికి నానా ఇచ్చిన చెక్కపలక పైన బాబా పడుకొని ఉన్నారు. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743