భక్తి కథలు

శ్రీ సాయ లీలామృతం-93

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాబా చెప్పిన ఆమాట వినేసరికి కాకాకు భయపట్టుకుంది. పైన చెప్పేటపుడు సాయి కాకాకు విసుగ్గాకూడా కనిపించారు. దాంతో చాలా భయపడ్డారు. ఇంటికి వెళ్లాడు. కాని అతని మనసు బాబా దగ్గర లేకుంటే ఏదైనా ప్రమాదం జరుగుతుంది అని అనిపించసాగింది. అందుకే ఏది నిర్ణయించుకోలేక సతమతవౌతున్నాడు. అపుడు వారింటికి శ్యామా వచ్చాడు. తన బాధను పంచుకోవడానికి వీలు అవుతుంది.
‘‘రా శ్యామారారా కూర్చో’అన్నాడు కాకా
‘‘లేదు తొందరగా పని ఉంది. నేను వెళ్తుంటే బాబా నీవు బొంబాయి వెళ్తున్నావని, నీ జ్వరంగా ఉందని నీకు ధైర్యంగా ఉంటుంది ఈ విబూదిని ధరించమని చెప్పు కాకాతో అని నన్ను పంపించారు. ఇదిగో తీసుకో’’అంటూ తొందర పెట్టేశాడు.
కాకా ఏమీ మాట్లాడకముందే ‘‘బాబా జాగ్రత్తగా వెళ్లిరమ్మని చెప్పారు నిన్భు’’అని కూడా చెప్పేసి గబగబా వెళ్లిపోయారు శ్యామా.
చేసేది ఏమీ లేక అంతాబాబానే చూసుకొంటారులే అని మనసు నిశ్చింత చేసుకొని బొంబాయి ప్రయాణమయ్యాడు. అక్కడ బంధువుల ఇంటిలో దిగాడు. వారంతా ఇంతజ్వరం ఉంది కదావైద్యుని దగ్గరకు వెళ్దాం అన్నారు. కానికాకా మాత్రం బాబా ఊది పెట్టుకుంటేచాలన్నా రు. అందుకేనేను ఊది తప్ప ఏమీ పెట్టుకోనుఅనివారికి చెప్పడమేకాదు. చేసి చూపించేవారు.
బాబా దక్షిణ తీసుకోవడంలో కూడా ఎంతో గూడార్థం ఉండేది. ఒక్కొక్కప్పుడు భక్తులు దాన్ని అర్థం చేసుకొనేవారు కాదు. మరొకప్పుడు బాబానేవారికి అర్థం అయ్యేలా చేసేవారు. ఒకసారి శ్యామా వచ్చారు. ‘‘బాబా నేను గురుచరిత్రను చదవాలనుకొంటున్నాను. నాకు అనుమతి నివ్వు’’అని అడిగాడు.
‘గురు చరిత్ర చదవడానికి నీకు నా అనుమతి ఎందుకు ఊరికినే చదివితే ఏంలాభం వస్తుంది’ అన్నారుబాబా.
‘గురు చరిత్ర చదివితే జ్ఞానం వస్తుంది కదా బాబా’ అన్నాడు శ్యామా.
‘కేవలం చదివితే చాలదుశ్యామా. దాన్ని ఆచరించాలి. అపుడే దాని వల్ల జ్ఞానం వస్తుంది ’అన్నాడు బాబా.
అంతలో నానా వచ్చాడు. బాబా ‘నానా వచ్చావా నీవు నాకు ఇస్తాను అంటున్నావు కాని ఇవ్వడంలేదు. ’అన్నారు.
‘నేను ఏమి ఇస్తానని అన్నానో నాకు గుర్తులేదుబాబా’అన్నాడు నానా.
‘అదేమి అట్లా అంటున్నావు. నాకు నీవు పదకొండు రూపాయలు ఇవ్వాలి కదా’అన్నారుబాబా.
‘నేను చాలా సార్లు పదకొండు రూపాయలు ఇచ్చాను బాబా’ అన్నాడు నానా.
అంతలో సాఠె వచ్చాడు. బాబా ‘సాఠె నీవు నాకు పదకొండు రూపాయలు ఎపుడిస్తావు’అన్నారు.
సాఠె ‘బాబా నేను ఎపుడో మీకు సమర్పించాను. ఇదిగోండి తీసుకోండి అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు’సాఠె.
బాబా చిరునవ్వు నవ్వాడు.
అక్కడే ఉన్నా శ్యామా ‘అదేంటి బాబా నీకు 11రూపాయలు ఇవ్వమంటే సాష్టాంగ నమస్కారం చేశాడు. నీవు నవ్వుతున్నావు. నేను నిజంగా 11 రూపాయలు ఇస్తే నన్ను మళ్లీమళ్లీ అడుగుతున్నావు’అన్నాడు.
అపుడు సాఠె ‘శ్యామా! నీకు బాబా ఏం చెపుతున్నారో అర్థం చేసుకో. నీ మనసు, కర్మేంద్రియాలు ఐదు, జ్ఞానేంద్రియాలు ఐదు ఈ మూడింటిని కలసి పదకొండు రూపాయలను అని బాబా అంటున్నారు.’అన్నాడు.

బాబా ‘‘నిజం శ్యామా నీవే తెలుసుకొంటే ఏం లాభం లేదు. ఆచరిస్తే దాని ఫలితం ఉంటుంది’’ అది తెలుసుకొన్నవాడే నిజమైన జ్ఞాని.
దీక్షిత్ ఒకసారి ఓ వేదాంత గ్రంథము చదువుతున్నాడు. అందులో బ్రహ్మ సత్యమని, కనిపించే జగత్తు అసత్యము అని ఉంది. కనిపిస్తుంటే అది అసత్యమంటారు. కనిపించని దైవాన్ని సత్యమని అంటారు ఇది నేను ఏలా భావించాలి అని మనసులో అనుకొన్నాడు. అపుడు శ్యామా బాబా దగ్గర నుంచి వచ్చి ‘దీక్షిత్ బాబా నిన్ను వందరూపాయలు ఇవ్వమని అడిగారు’అని చెప్పాడు. అంతే దీక్షిత్ మనసులోజ్ఞానోదయం అయింది . ఇపుడు అర్థం అయింది. జగత్తు బ్రహ్మ అంతా ఒక్కటే నని బాబా చెప్తున్నాడు. మనమే రెండువిధాలుగా చూస్తున్నాం కాని ఉన్నది మాత్రం ఒకటే. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743