భక్తి కథలు

శ్రీ సాయ లీలామృతం-94

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగత్తు జగన్నాథుడు అనే రెండు పదార్థాలు ఏవీ లేవు. జగన్నాథుడే ఒక్కడే ఉన్నాడన్నమాట అని శ్యామా తనలో తాను అనుకొంటూ పైకి అన్నాడు.
అది ఏమీ అర్థం కాక శ్యామా‘దీక్షిత్ బాబా100 రూపాయలు అడిగితే నీవు ఏమిటి ఇలా చెబుతున్నావు’అని అన్నాడు.
అపుడు శ్యామా ను కూర్చోబెట్టుకుని జరిగినదంతా చెప్పాడు. అపుడు వర్ణించలేని ఆనందం వచ్చింది వారిరువురికి . ఇద్దరూ కలసి బాబా దర్శనానికి వెళ్లారు.
ఒకసారి రేగే బాబా దర్శనార్థం వచ్చాడు. ఆయన్ను బాబా ఆరు రూపాయలు కావాలని అడిగాడు.
రేగే వెంటనే సాష్టాంగదండప్రణామాలు ఆచరించి ‘బాబా! నా అరిషడ్వర్గాలు సమర్పించాను. నీవుఏది ప్రసాదిస్తే దానిని నేను ప్రసాదంగానే భావిస్తాను. నేను నీ పాదాలను ఆశ్రయించాను. నన్ను నీట ముంచినా పాలముంచినా నీవే దిక్కు. నేను ఎవరినీ యాచించను. నాకు మీరు సద్గురువుగా దొరికారని నేను భావిస్తున్నాను. నేను నిమిత్తమాత్రుడిని. మీరే నా చేత ఏది చేయించాలనుకొంటారో దాన్ని చేయించండి’అని కన్నీళ్లు తుడుచుకున్నాడు.
బాబా చిరునవ్వుతూ రేగే నీవంటే అందుకే నాకిష్టం. భగవంతుడిని నమ్మితే చాలు ఏపుడు ఏది కావాలో దాన్ని భగవంతుడే మనకు అందిస్తాడు. మనం భగవంతుని నమ్మితే చాలు ప్రతినిమిషం నాకు ఇది కావాలి అది కావాలి నీకు ఈ మొక్కు చెల్లిస్తాను అని చెప్పనక్కర్లేదు అన్నారు. బాబా.
అక్కడున్నవారందరూ బాబా మాటలు విని తన్మయులై ‘‘మమ్ముల్ని దీవించండి స్వామి. మీ అనుగ్రహం మాపై సదా ఉండాలి’’అని నమస్కరించారు.
బాబా అందరినీ దీవించాడు.
***
ఒకసారి ఓ పేద బ్రాహ్మణుడు అనంతాచారి వచ్చాడు. అతనికి ఇద్దరు పిల్లలు వుండేవారు. అతడు వచ్చి ‘బాబా నేను దినం గడవక నీ దగ్గర వచ్చాను. నన్ను నీవు కాపాడు’అని అడిగాడు.
‘అందరినీ కాపాడేవాడు భగవంతుడు. ఆయనే అందరినీ కాపాడుతాడు ’అన్నాడు.
అనంతాచారి శబ్దం చేయకుండా బాబాకు నమస్కారం చేసి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న మహిల్సాపతి ‘బాబా ఆయన నినే్న నమ్ముకుని దూరం నుంచి వచ్చాడు. ఆయన్ను నీవే కాపాడాలి బాబా ’అన్నాడు.
‘నన్ను ఏం చేయమంటావు. ఆయనకు మనసులో నన్ను ఆయన మతం వాడిని కాదని అనుకొంటుంటాడు.
మరి నేను ఏం చేయగలను.
నమ్మకం ఉంటే చాలు అంతా భగవంతుడే చూసుకొంటాడు. నిన్నునన్నుచూసేది ఆ భగవంతుడే ’అన్నాడు బాబా.
అపుడే మసీదు నుంచి వెళ్లిన అనంతాచారి తిరిగి వచ్చాడు.
‘బాబా! ఇలా నేను నీకు నమస్కరించివెళ్లాను. నన్ను వాళ్లే పిలిచి గణపతి ఆలయంలోపూజారిగా ఉండమన్నారు. ఇదంతా మీ చలువే. మీరు నన్నుకాపాడుతానని చెప్పలేదని అనుకొంటూ వెళ్లాను. కాని, మీరు నన్ను కష్టాల నుంచి కాపాడారు’అని చెప్పాడు.
బాబా ‘అది అంతా ఆ నారాయణుడు చేసాడు అంతే. ఇందులో నేను చేసింది ఏమీ లేదు . కనీసం ఎవరితో కూడానైనాచెప్పలేదు. అప్పట్నుంచి ఇక్కడే కూర్చుని ఉన్నాను. పోనీలే నా సంగతి వదిలేయి. నీకు నారాయణుడు తోడు నీడా ఉంటాడు. ఆ గణపతినే నమ్ముకో ’అన్నారు.
అనంతాచారి నమస్కారం చేసి వెళ్లాడు. అతని మనసులో తనను బాబా నమ్మడం లేదని అనుకొన్నాడు.
తెల్లవారి పొద్దునే్న గణపతి ఆలయానికి అనంతాచారి వెళ్లాడు. నిత్యకైంకర్యాలు చేస్తున్నాడు. గణపతికి అభిషేకం చేస్తున్నాడు. గణపతి స్థానంలో సాయిబాబా కూర్చుని ఉన్నారు. అతడు తన్మయత్వంలో పాలు పోస్తున్నాడు. ’వెంటనే పోసే పాలను ఆపేసి బాబా అని అరిచాడు. అక్కడున్న భక్తులకు ఏమీ అర్థం కాలేదు. అనంతాచారి మళ్లీ తేరిపార గణపతి విగ్రహం వైపు చూశాడు. మళ్లీగణపతి లాగా కనిపించాడు. మళ్లీ గంధం ధారణ కుంకుమను దిద్దడం లాంటివి చేస్తున్నపుడు బాబా శరీరం తనకు తగిలినట్లుగా అనిపించింది. ఇదేమి అని చూస్తుతిరిగి అనంతాచారి బాబా చిరునవ్వుతో కనిపించారు. పూజ ముగిసిన తరువాత అనంతాచారి మసీదు కు వెళ్లాడు. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743