భక్తి కథలు

శ్రీ సాయ లీలామృతం 97

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం రోజులు కూడా రామాయణం గురించి చెప్పాలని అనుకున్నట్టు చెప్పారు. వారికి దాసగణు నేనే వారంరోజుల పాటు రామాయణం చెప్తానని మాటిచ్చాడు.
***
శివకాశీ దాసగణు చెప్పే పాదుకాపట్ట్భాషేకానికి వెళ్లాడు.
దాసగణు అనర్గళంగా చెప్తున్నారు. అందరూ తలలూపుతూ వింటున్నారు. దాసగణు..
భరతుడు ఎంతో బాధ పడ్డారు. సీతారామలక్ష్మణులను చూచి కన్నీరు కార్చాడు. ‘అన్నా! ఇదంతా నాకు తెలియకుండానే జరిగిపోయింది. నీవు వెనక్కువచ్చి నీ సింహాసనాన్ని నీవే అధిష్టించు. నీవు రాజు అయితే ప్రజలందరూ ఎంతో సంతోషిస్తారు. ఇపుడు కైకేయి మాత కూడా తన తప్పు తెలుసుకొంది. నిన్ను పిలవడానికి ఆమె కూడా వచ్చింది. తన పట్టుదలతో తన భర్తను దూరం చేసుకొందని చాలా బాధ పడుతోంది. నాకీ రాజ్యం ఎందుకు అన్నా.. నేనెల్లపుడూ నీ సేవకుడుగానే ఉంటాను. ’అని పరిపరివిధాల చెప్పాడు.
రాముడు తండ్రి ఇచ్చిన మాటను కాదని ఇపుడు మనిద్దరం మాట్లాడుకుని మనిష్టప్రకారం చేస్తే మన తండ్రి అసత్యవంతుడు అవుతాడు. కైకేయి మాత అడగడంలో ఏ తప్పు లేదు. ఏ తల్లి యైనా కుమారునిక్షేమం కోసమే ఆలోచిస్తుంది. కనుక నీవు ఏమి దిగులుపడకు. అసలు అంతా దైవేచ్ఛ ప్రకారం జరుగుతుంది. నేను నీవు అందరూ ఆ భగవంతుని ఆధీనులం. భగవంతుడు చెప్పినట్లు చేయాలి అంతే అంటూ రాముడు ఎన్నోవిధాలుగా తాను రాజ్యమేలలని చెప్పాడు. చివరకు రాముని పాదుకలు తీసుకొని రాజ్యానికి తిరిగి వచ్చి పాదుకా పట్ట్భాషేకం చేసి భరతుడు రాముని ప్రతినిథిగా రాజ్యవ్యవహారాలు చూసేవాడని దాసగణు చెప్పుతున్నాడు.
కాశీ తన్మయత్వంతో వింటున్నాడు. ఉపన్యాసం అయిపోయిందని కనులు తిప్పి ఇటు చూసేసరికి తన అన్నదమ్ములుకూడా కూర్చుని పాదుకాపట్ట్భాషేకం వింటున్నారు.
ఎపుడూ ఉపన్యాసాలకు రాని వారు వచ్చి ఇలా వినడమేమిటి అనుకొంటూ సంతోషంతో వారి వైపు చూశారు. అంతలో కాశీ వదినలు వచ్చి అందరికీ అరటిపండ్లు రాముని ప్రసాదంగా పంచారు.
జరిగేది చూసి కాశీ విచిత్రంగా చూశాడు. వారి దగ్గర నుంచి తాను కూడా అరటిపండు తీసుకొని ఇంటికి వచ్చాడు. అన్నదమ్ములు కూడా వచ్చారు. వారంతా భోజనాలు కానిచ్చి అందరూ ఒకచోట కూర్చున్నారు.
అందరిలోకి కాశీ పెద్దన్న ‘‘కాశీ! నీవు బాబా దగ్గరకు వెళ్తావని వెళ్లావు కదా. అపుడు మనింటికి ఒక ఫకీరు వచ్చారు. చూడడానికి బాబా లాగే వున్నారు. కాని అతడు బాబా కాదు. వారు మనింటికి వచ్చి ఆకలి వేస్తోంది. కాశీ అయితే అన్నం పెట్టేవాడు. మీలో ఎవరన్నా పెడతారా? అని అడిగాడు. అపుడు మీ రెండో వదిన వచ్చి ‘రండిస్వామి ఇలా వచ్చి కూర్చోండి ’అని చెప్పిఅతనికి అన్నం పెట్టింది.
అతడు ఎన్నో విషయాలు చెప్పాడు. శివకాశీ ని మీరు వదిలి నీ పంట పొలాలు, ఇల్లు విభజించుకుని వెళ్దామని అనుకుంటున్నారు కాని ఇది మంచి పద్ధతి కాదు అని ఎంతో చెప్పారు. వారి మాటలు విన్నాక ఎందుకో గాని మాకు మన పొలాలు విభజించుకోవాలని నాకు కాదు ఎవరికీ నచ్చడం లేదు. అందుకే నీవే అంతా పొలం పని చూసుకో. మేము కూడా మా వ్యాపారాలు మెల్లమెల్లగా అక్కడ మానుకొని ఇక్కడికే వచ్చేస్తాము. మనందరం కలసి ఉందాం అనుకొన్నాము. ఇది నాకు ఒక్కడికే అనిపించలేదు. వీరిద్దరూ కూడా నా దగ్గరకు వచ్చి చెప్పారు. నాకు అట్లాగే ఉందని విషయం మేముగ్గురం చెప్పుకున్నాం. ఇపుడు నీతో చెబుతున్నాం’‘అన్నాడు. అంతా వింటున్న శివకాశీ కళ్లు నీటితో నిండిపోయాయి. కన్నీళ్లతో పెద్దన్న పాదాలకు నమస్కారం చేశాడు. అన్నా అంటూ ఏడుస్తున్న కాశీని దగ్గరకు తీసుకొని కాశీ నీలో ఇంత బాధ ఉందని మాకు తెలియలేదు నీవు ఇక బాధపడకు మనందరం కలిసే ఉందాం’ అన్నాడు పెద్దన్న.
అందరూ అన్నదమ్ములూ సంతోషం తో ఒకరినొకరు కౌగిలించుకున్నారు. వదినమ్మలు కూడా సంతోషంగావారిని చూశారు. ఇక వారి తల్లి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.

- ఇంకా ఉంది