భక్తి కథలు

శ్రీ సాయ లీలామృతం- 98

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలంతా కలసి మెలసి ఉండచ్చు అని ఎంతో కేరింతలు కొట్టి ఆడుకుంటున్నారు. కాశీ ఇదంతా బాబా మహత్వం. నేను నన్ను కాపాడమని బాబాను వేడుకున్నాను. కాని మనలందరినీ బాబా నే కాపాడాడు అని చెప్పాడు. ఇపుడు బాబా దర్శనం చేసుకొని వస్తాను అని బయలు దేరాడు కాశీ. మేము వస్తామని ముగ్గురు అన్నదమ్ములు కాశీ వెంట వెళ్లారు. వారిని చూసీ చూడగానే ‘ఆహా! రామలక్ష్మణ భరత శత్రుఘు్నలు నలుగురూ వస్తున్నట్టు ఉన్నారే.. మీ సమస్య తీరిందా. ఆ బాబా మీకు కాశీ గురించి చెప్పాడా’అంటూపలకరించిన బాబా ఆ ఇంటికి వచ్చిన బాబా రూపంలో కనిపించారు వారికి మరునిముషంలో బాబా లాగే కనిపించారు. వారికి అంతులేని ఆనందం వేసింది. బాబా మీరే దిక్కు. అందరూ నమస్కరించారు. అంతా చల్లగా ఉండండి. అల్లా అచ్చాకరేగా.. అని బాబా దీవించారు.
బాబా ఎప్పుడూ శాస్త్రాలను పాటించమని చెప్పేవారు. కాని మూర్ఖంగా ఏదీ చేయవద్దని చెప్పేవారు. ఒకసారి కేల్కర్ అను భక్తుడు వచ్చి ‘బాబా నేను సదా మీరు చెప్పినట్లు చేస్తున్నాను. కాని ఒక్కోసారి చేయలేకపోతున్నాను’ అని అన్నాడు.
బాబా‘ఏవిషయంలో’అని అడిగారు.
‘మీరు ప్రతిరోజు మీరు అతిథిపూజ తర్వాత భోంచేయమని చెప్పారు కదా. అది ఒక్కోసారి జరుగుతోంది మరొకప్పుడు జరగడంలేదు. ఎవరూ అతిథులుగా రావడంలేదు’అని చెప్పాడు.
బాబా చిరునవ్వు నవ్వి ..‘కేల్కర్ అతిథులు అంటే కేవలం మనుష్యులే కాదు చీమ,దోమ, కాకి, నక్క, పులి ఏదైనా సరే అతిథి భోజనం వేళకు ఎవరు వచ్చినా వారు అతిథులాగే మనం పూజించాలి. ఎవరూ నీ కంటికి కనిపించకపోతే నీవు కాకబలి అంటూ వీధిలో కాస్తంత అన్నం పెట్టిరా.. ఏదో ఒక ప్రాణి వచ్చి తింటుంది అది కూడా అతిథి పూజే. అసలు నోరు లేని ప్రాణికి తిండి పెట్టడమే అసలైన అతిథి పూజ’ దీన్ని అర్థం చేసుకొంటే తెలుస్తుంది అని అన్నారు.
***
దాసుగణు వచ్చి ఆరోజు శ్రీకృష్ణునిపై గోపికులకున్న ప్రేమ గురించి చెప్పసాగాడు. అందరూ వింటున్నారు. రుక్మిణీదేవి, సత్యభామల కన్నా ఎక్కువగా శ్రీకృష్ణుని పై ప్రేమ గోపికలకే ఉందని నారదుల వారు చెప్తే వారు దాన్ని అంగీకరించలేదు. ఈ విషయం శ్రీకృష్ణులవారు విన్నారు.
ఆయన ఉన్నట్టుండి తనకు శిరోభారంగా ఉందని చెప్పారు. అందరూ ఎన్నో రకాల వైద్యాలు చేసారు. కాని కృష్ణయ్య తలనొప్పితగ్గలేదు. పట్టపురాణులు రాజవైద్యులను పిలిచారు. వారు వచ్చి ఎన్నో విధాలుగా ప్రయత్నించి చూశారు. కాని గోపాలుని తలనొప్పితగ్గలేదు. నారదుడు కొంత సేపు ఆలోచించి ఇలా చెప్పారు. ‘నేను బాగా ఆలోచించి చూసాను. ఈ కృష్ణయ్యను తల్లడిల్లచేసే ఈ తలనొప్పి తగ్గాలంటే కృష్ణయ్యపై ప్రేమ ఉన్న భక్తులు వారి పాదధూళి పూస్తే తగ్గుతుంది’ అని చెప్పారు. అందరూ ఒకేసారి పాదధూళినా అయ్యో నా ప్రాణాలను ఇవ్వమన్నా ఇస్తాను. కాని పాదధూళి ఎలా ఇవ్వగలను పాదధూళిని తలపై రాస్తే ఎంత పాపమొస్తుందో అని వాపోయారు. కాని రాజసౌధం నిండా ఉన్నవారు ఎవరూ పాదధూళిని వ్వడానికి ఇష్టపడలేదు. కాని ఈ విషయం గోపికలకు తెలిసింది. వారంతా పరుగు పరుగున వచ్చారు. వారి వారి పాదధూళిని తీసుకొని వచ్చి శ్రీకృష్ణుల వారికి పూస్తూ పోయారు. ఆ ధూళి లేపనం వల్ల కృష్ణయ్య తలనొప్పి తగ్గిపోయింది. కాని అక్కడున్నవారంతా అయ్యో మీకు ఎంతో పాపం వచ్చి ఉంటుంది. సద్గురువు, స్వయంగా భగవానుడైన కృష్ణయ్యకే పాదధూళిని పూస్తారా అని ఎంతో ఆవేదనతో అడిగారు. అపుడు గోపికలంతా కలసి ఒకే మాట చెప్పారు. ‘మాకు కృష్ణయ్యనే ముఖ్యం. ఆయన ఆనందంగా ఉండడానికి మేము ఏమి చేయమన్నా చేస్తాం. ఆ పని వల్ల మాకు పాపమొచ్చినా పుణ్యమొచ్చినా మాకు ఒకటే ’అన్నారు. అంతా నోరు వెళ్లబెట్టి చూశారు.
బాబా దగ్గర కూర్చుని దాసగణు చెప్పేది వింటున్న జనం కూడా ఆశ్చర్యంగా చూసారు. అంతలో మసీదులోనికి ఓ ముసలి మేక వచ్చింది. దాన్ని చూడగానే బాబా బడేబాబా అనే ఆయన్ను పిలిచారు‘బడేబాబా కత్తి తెచ్చి ఈ మేకను ఒక వేటుతో చంపేయి’అని చెప్పారు. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743