భక్తి కథలు

శ్రీ సాయ లీలామృతం- 99

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బడేబాబా ఊరుకొండిపోయాడు. ఇదేంటి ఇంత ముసలి మేక ను చంపమని చెప్తున్నారు. పాపం రక్షణ కోరి ఈ మేక బాబా దగ్గరకు వచ్చి ఉంటుంది. ఇపుడు ఈ మేకను బాబానే చంపమంటే ఇక దానికి దిక్కు ఎవరు అని మనసులో అనుకొంటూ దూరంగా జరిగిపోయాడు. అంతలో ఆచారవంతుడైన కేల్కర్ వచ్చాడు. వెంటనే బాబా‘కేల్కర్ ఇలా రా లక్ష్మీబాయి దగ్గరకు వెళ్లి కత్తి తీసుకొని వచ్చి ఈ మేకను ఒక్కదెబ్బతో చంపేసేయి’అని చెప్పారు. అతడు అన్యమన్యస్కంగానే లక్ష్మీబాయి దగ్గరకు వెళ్లి కత్తి ని తీసుకొని వచ్చాడు. బాబా దగ్గరకు కత్తి తేగానే కత్తిని ఎందుకు తీసుకొని రమ్మన్నారో తెలుసుకొన్న లక్ష్మీబాదు పరుగున వచ్చి కత్తి వెనుక్కు తీసుకొని వెళ్లిపోయింది.
ఇంకో చోట తెస్తానని కేల్కర్ కూడా వెళ్లిపోయాడు. అందరూ దూరంగా నిలబడి చూస్తున్నారు. కాని ఒక్కరూ సాయి చెప్పిన మాట వింటున్నారు కాని ఆచరించడం లేదు. ‘దాసూ ఇదిగో ఈ కత్తిని తీసుకొని ఈ మేకనుచంపు ఇందాకటి నుంచి చెప్తుంటే ఒక్కరూ వినడంలేదు’అన్నారు. అంతే ఉన్నట్టుండి కత్తి తీసుకొని దాసగణు మేక తలపై విసురుగా వేయబోయాడు. వెంటనే బాబా ‘ఆగాగు .. ఇక చాలు ఈ మేకను తీసుకెళ్లడానికి వైకుంఠ వాసులు వచ్చారు’అన్నారు. అంతా బయటకు చూశారు. అంతలో పాపమా మేక చనిపోయి సాయి పాదాల వద్ద పడిపోయింది. అంటే భక్తుడైన వాడు సద్గురువు చెప్పినమాట అది ఏదైనా సరే విని ఆచరించి తీరాలని తెలసింది. అట్లానే బాబా వైకుంఠం నుంచి వచ్చారు అంటే బాబాస్వయంగా మహావిష్ణువు అవతారం. సర్వాంతర్యామి ఎదుట ప్రాణాలు విడిచినవారికి విష్ణుసాయుజ్యం కాక మరేం దక్కుతుంది. ఇలా అంతర్లీనమైన ఎన్నో అర్థాలున్న సంఘటనలు బాబా దగ్గర జరుగుతుండేవి. వాటిని కొంతమంది అర్థం చేసుకొనేవారు మరికొంతమంది చేసుకొనేవారు కాదు.
***
బాబాను నమ్ముకుంటే చాలు. ఆయనే సద్గతి చూపేవారు. మనసా వాచా కర్మణా బాబాను నమ్మినవాళ్లు మంచిదారిలోనే ఉన్నారు. నేటికీ కూడా బాబానునమ్ముకున్నవారు ఎంతోమంది కనిపిస్తుంటారు. ఒకసారి బాబా దగ్గరకు విజయానందు అనే సన్యాసి రావాలనుకొన్నాడు. అతడు మద్రాసు నుండి మానస సరోవరం వెళ్లాలని నిశ్చయించుకొని బయలుదేరాడు. దారిలో శిరిడీ కి వెళ్లి అక్కడున్న బాబాను కూడా దర్శనం చేసుకోవాలనుకొన్నాడు. కాని ఆయనకు దారిలో కొందరు భక్తులు కనిపించి మాటల్లో శిరిడీ ప్రయాణం చాలా కష్టమని చెప్పారు. అక్కడికి వెళ్లడం కష్టమని చెప్పగానే తాను వెళ్లాలా వద్దా ఆలోచించారు. కాని చివరకు వెళ్లాలనే అనుకొని శిరిడికీ వచ్చారు. అతడు బాబాను దర్శనం చేసుకోగానే బాబా ఉగ్రులైయ్యారు.
‘ఎందుకీ సన్యాసి వేషం కష్టం వచ్చినా నష్టం జరిగినా దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా తట్టుకోలేనివారు, అన్ని సుఖాలు ఉండాలని కోరుకునేవారు, రాగ ద్వేషాలను వదలలేనివారు ఎందుకు సన్యసించడం’’అన్నారు. తన గురించే బాబా అంటున్నారని తెలుసుకొని అతడు వౌనంగా బాబా పాదాలకు నమస్కరించి బాబా తప్పు చేశాను. నన్ను క్షమించు అన్నారు. ‘మనసును దృఢం చేసుకోవాలి. ప్రతిదానికి స్పందిస్తే రాబోయే కష్టాన్ని ఎలా తట్టుకొంటావు. సామాన్యునిగా ప్రవర్తిస్తాను అంటే సన్యాసం ఎందుకు తీసుకొన్నావు’అన్నారు. అతడు మరేమీ మాట్లాడలేదు. శిరిడీలోనే నాలుగు రోజులు ఉండడానికి తనకు అనుమతి ఇవ్వమని అతడు కోరుకున్నారు. నాలుగు రోజులు ఏమి వారం రోజు లు ఇక్కడే ఉంటావులే అని హాస్యమాడారు బాబా విజయానందునితో. అప్పటిదాకా కోపంగా ఉన్న బాబా నవ్వుతూ మాట్లాడేసరికి విజయానందుడు కూడా నవ్వుతో ఆనందంగా శిరిడీ లో ఉండిపోయాడు. మరునాడు విజయానందుడు పరుగు పరుగున వచ్చి కన్నీళ్లు కారుస్తూ ‘బాబా మా అమ్మ చనిపోయిందట. నేను వెళ్లి చూసి వస్తాను’అన్నాడు. బాబా విపరీతమైన కోపం తెచ్చుకున్నారు.
‘ఇంత మమకారం ఉన్నప్పుడు సన్యసించకూడదని నిన్ననే చెప్పలేదా నీకు. అయినా వసతి గృహంలో ద్వారాలు బంధించి ఓర్పుతో, జాగ్రత్తగా వేచి చూడు. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743