భక్తి కథలు

శ్రీ సాయ లీలామృతం- 100

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దొంగలు సర్వం దోచుకుపోతారు. ధనము, శరీరము ఏవీ శాశ్వతం కాదు. ఇది గుర్తుంచుకో. సుఖాపేక్ష వదులు. నీ సన్యాసధర్మాన్ని నీవు పాటించు’అని గట్టిగా చెప్పారు.
విజయానందుడు కూడా ఇక మారు మాట్లాడలేదు. వౌనంగా తన బసకు వెళ్లాడు.
సాయంత్రం మహిల్సాపతి వచ్చాడు. అతడు రాగానే ‘మహీ నిన్న వచ్చాడు కదా ఆ దొంగ సన్యాసి అతడికి కాస్త నీళ్లు పాలు ఇస్తూ నీవే దగ్గర ఉండి సేవ చేయి భాగవత పారాయణ చేయమని నా మాటగా చెప్పు. జీవుడు వెళ్లిపోయే రోజులు దగ్గరకు వచ్చాయి’అని చెప్పారు.
బాబా చెప్పింది సరిగా అర్థం కాకపోయినా విజయానందునికి సేవ చేయమని చెప్పారు కనుక అతడికి వెళ్లి బాబా చెప్పినట్లు భాగవత పారాయణ చేయమని విశ్రాంతి తీసుకోమని చెప్పారు. తాను అక్కడే ఉండిపోయాడు. నాలుగు రోజులు గడవకముందే విజయానందుడు జ్వరం వచ్చి కన్నుమూసాడు. బాబాకు ఈ విషయం చెప్పారు. అతడు ఈ రోజు ఆ విజయానందుని పార్థివ శరీరాన్ని అలానే ఉంచండి. రేపు ఖనన ఏర్పాట్లు చేయవచ్చు అని చెప్పారు.
మరుసటి రోజు పోలీసులు వచ్చి విజయానందుని శరీరాన్ని చూసి పరీక్షించి సహజమరణమే నని ధృవీకరించి మరీ వెళ్లారు. ఆ తరువాత విజయానందుని శరీరాన్ని శిరిడీ వాసులే ఖననం చేశారు.
అట్లా బాబాను నమ్ముకున్నవాళ్లకు ఏది అవసరమో దాన్ని బాబానే అందేట్లు చేస్తారు. దాసగణు ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తిస్తే చాలు వారికి ఇవ్వాల్సిన ఫలితాన్ని నేను ఇస్తానని ఆనాడు భగవంతుడైన కృష్ణుడు చెప్పాడు. నేడు ఈ బాబా చెప్తున్నారు అని పదేపదే చెప్పేవారు.
***
ఒకరోజు శిరిడీలో జోరుగా వర్షం కురవసాగింది. మసీదు అంతా నీళ్లతో తడిసిపోతుంది. చివరకు బాబా కూర్చుని ఉన్న ప్రదేశం కూడా తడిసిపోయింది. ఎక్కడా నిలువడానికి చోటు లేకపోయింది. పరిస్థితిని చూసిన భక్తులు‘‘బాబా మీరు చావడిలో రాత్రికి విశ్రాంతి తీసుకోండి ’అని అన్నారు.
‘ఏమీ ఫర్వాలేదు. నేను ఇక్కడే ఉండిపోతాను. లేకుంటే నేను చావిడికి రావడం అనేది రాను రాను అది ఒక ఉత్సవంగా తయారు అవుతుంది ’అన్నారు.
‘అదేంటి వర్షంలో తడిసిపోతూ ఉన్నారు పక్కకు రండి అంటే ఉత్సవం చేయాల్సి వుంటుంది అంటారేమిటి బాబా’ అన్నాడు మహిల్సాపతి.
‘అవును మహి రాను రాను ఉత్సవంగానే మారబోతుంది. ఇది అవసరం అంటావా ఇప్పుడు ’అన్నారు బాబా.
‘అవసరమే బాబా ఇలా కాదు మిమ్మల్ని తీసుకొని వెళ్లేది ’అంటూ మహిల్సాపతి బాబాను అమాంతంగా ఎత్తుకొని చావడిలోకి తీసుకొని వెళ్లాడు మహిల్సాపతి. నాటి నుంచి ఒక రాత్రి చావడిలో బాబా నిద్రిస్తే మరుసటి రోజు రాత్రి మసీదులో నిద్రించేవారు.
బాబా ఈ చావడిలో నిద్రించడమే గొప్పవుత్సవంగా మారుతుందని చెప్పారు.
బాబా దగ్గరకు అన్నా చించనీకర్ అనే దంపతులు వచ్చారు. వారు ఎక్కువకాలం శిరిడీ లో ఉంటూ బాబాకు నిత్యసేవలు చేసుకొనేవారు. ఒకరోజు చావడిలో నిద్రించడానికి బాబా వెళ్తున్నపుడు వారు కూడా చావడి చేరారు. అక్కడ ఉన్న పరిస్థితిని చూసి ‘బాబా ఇదంతా మరమ్మత్తు చేయిస్తే చాలా బాగుంటుంది కదా. ఆ అవకాశం ఎపుడు కలుగుచేస్తావో’అన్నారు.
‘వస్తుందిలే తొందర ఎందుకు ఎప్పుడు ఏది జరగాలని భగవంతుడు అనుకొంటాడో అపుడు అది జరుగుతుంది ’అన్నారు. అంతలో అన్నాచించనీకర్ భార్య వచ్చి ‘బాబా మేము నిన్ను నమ్ముకుని వున్నాము. మాకు వయస్సు మీరుతోంది. కాని మా వారసులు ఎవరూ లేరనే బాధ మమ్ముల్ని తొలిచేస్తోంది ’అని కన్నీళ్లు పెట్టుకొంది.
‘మీరు ఏమి కోరుకున్నా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కాని అది మీకు మేలు చేస్తుందా లేదా అని చూస్తాను. మీకు మేలు చేసేపని యైతే మీరు అడగకపోయినా నేను మీకు దానిని చేస్తాను. అయినా చేసేవాడు చేయించేవాడు భగవంతుడు ఉన్నాడు కదా. ఆయనే అన్నీ చూసుకొంటాడు. మీరు నిశ్చింతగా ఉండండి’అని బాబా ఆమెకు చెప్పారు.
కొన్నాళ్లు గడిచాయి ఒకరోజు అన్నాచించనీకర్‌ను తెలిసిన ఒక వ్యక్తి వచ్చి ‘అన్నా నీవు కోర్టు వాజ్యంలో ఓడిపోయావు. అని చెప్పాడు. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743